Headlines

తలస్నానానికి ముందు ఇలా చేయండి.. చింపిరి జుట్టు కాస్త సిల్కీగా, ఒత్తుగా మారిపోయిద్ది.. | Hair Oil Benefits: What happens if you apply oil before washing your hair? What Experts Say About Hair Care and Dandruff

తలస్నానానికి ముందు ఇలా చేయండి.. చింపిరి జుట్టు కాస్త సిల్కీగా, ఒత్తుగా మారిపోయిద్ది.. | Hair Oil Benefits: What happens if you apply oil before washing your hair? What Experts Say About Hair Care and Dandruff


జుట్టుకు నూనె రాసుకోవడం అనేది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. పూర్వకాలంలో పెద్దలు రోజూ తలకు నూనె పెట్టుకుంటే తల వేడెక్కకుండా ఉంటుందని, జుట్టు బలంగా పెరిగి, బరువుగా అనిపించదని నమ్మేవారు. అయితే, ఆధునిక వైద్య శాస్త్రం నూనె వాడకం వెనుక ఉన్న వాస్తవాలను, దాని ప్రయోజనాలను స్పష్టంగా వివరిస్తుంది. హెయిర్ కేర్ నిపుణుల ప్రకారం.. జుట్టుకు నూనె ప్రధానంగా ఒక అద్భుతమైన సహజ కండిషనర్‌గా పనిచేస్తుంది. మనం తలస్నానం చేసినప్పుడు, ముఖ్యంగా నూనె అప్లై చేయకుండా చేస్తే, జుట్టు బిరుసుగా, గరుకుగా మారే అవకాశం ఉంటుంది. అదే తలస్నానానికి ముందు నూనె రాసుకుంటే, జుట్టు మృదువుగా, షైనీగా, సిల్కీగా కనిపిస్తుంది. నూనె జుట్టు క్యూటికల్‌ను (జుట్టు పైన ఉండే రక్షిత పొర) సున్నితం చేస్తుంది. ఇది షాంపూలు వాడినప్పుడు క్యూటికల్‌కు కలిగే నష్టాన్ని తగ్గించి, జుట్టును మరింత ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

మార్కెట్‌లో బాదం నూనె, ఆలివ్ నూనె, కొబ్బరి నూనె వంటి వివిధ రకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఒక రకం నూనెకు మరో రకం నూనెకు కండిషనింగ్ ప్రయోజనాలలో పెద్దగా తేడా ఉండదు. కొబ్బరి నూనె సులభంగా దొరుకుతుంది. ఆర్థికంగా కూడా అందుబాటులో ఉంటుంది. కొన్ని ఆయుర్వేదిక్ నూనెలు మూలికలతో కలిపి ఉండటం వల్ల జుట్టు రాలడాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. కానీ, కేవలం నూనె వాడకం వల్ల జుట్టు సమస్యలు, చుండ్రు, సోరియాసిస్ లేదా జుట్టు ఇన్ఫెక్షన్లు పూర్తిగా నయం కావని గుర్తించాలి. నూనెలు పేల వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కావు.

నూనెను ఎప్పుడు, ఎంతసేపు అప్లై చేయాలి?

తలస్నానానికి కనీసం ఒకటి లేదా రెండు గంటల ముందు స్కాల్ప్, జుట్టు పొడవుకు నూనెను అప్లై చేస్తే సరిపోతుంది. రాత్రంతా ఉంచుకోవడం కూడా సాధ్యమే, కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఇది మంచిది కాదు.

చుండ్రు – నూనె

చుండ్రు సమస్య ఉన్నవారు నూనెను రాత్రంతా ఉంచుకోవడం లేదా స్కాల్ప్‌కు అప్లై చేయడం ఖచ్చితంగా మానుకోవాలి. ఎందుకంటే చుండ్రుకు కారణమయ్యే మలస్సేజియా (Malassezia) అనే ఫంగస్‌కు నూనె ఆహారంగా మారుతుంది. ఇది ఫంగస్ పెరుగుదలను పెంచి, చుండ్రును మరింత తీవ్రం చేస్తుంది. అందువల్ల, చుండ్రు ఉన్నవారు తమ స్కాల్ప్‌కు నూనె రాసుకోకుండా, కేవలం జుట్టు పొడవుకు మాత్రమే అప్లై చేసి, కొద్దిసేపటికే తలస్నానం చేయడం శ్రేయస్కరం.

సోరియాసిస్ – నూనె

చుండ్రుకు విరుద్ధంగా, సోరియాసిస్ సమస్య ఉన్నవారికి నూనె ప్రయోజనకరంగా ఉంటుంది. సోరియాసిస్‌లో ఏర్పడే పొడి పొట్టును నూనె మృదువుగా చేస్తుంది, తద్వారా మంటను తగ్గించి, ఉపశమనాన్ని అందిస్తుంది. కాబట్టి, సోరియాసిస్ ఉన్నవారికి నూనెను వాడమని సూచించబడుతుంది.

తలస్నానం ఎంత తరచుగా చేయాలి?

స్కాల్ప్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, వారానికి రెండుసార్లు నూనె అప్లై చేసి తలస్నానం చేయాలని సాధారణంగా సూచిస్తారు. సరైన పద్ధతిలో నూనెను వాడటం ద్వారా జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.. ఇంకా ఏమైనా సందేహాలున్నా.. సమస్యలున్నా.. నేరుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *