Headlines

ఒక్క ట్విస్ట్.. క్లైమాక్స్ బ్లాస్ట్.. ఇదే సక్సెస్ మంత్ర | Tollywood’s New Success Formula: One Big Twist That Changes Everything video – Entertainment Videos in Telugu

ఒక్క ట్విస్ట్.. క్లైమాక్స్ బ్లాస్ట్.. ఇదే సక్సెస్ మంత్ర | Tollywood’s New Success Formula: One Big Twist That Changes Everything video – Entertainment Videos in Telugu


అనగనగా ఓ సినిమా.. అందులో ఒక ట్విస్ట్.. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో ఇదే కొత్త సక్సెస్ ఫార్ములా. కథని మలుపు తిప్పేలా ఓ అదిరిపోయే ట్విస్ట్ రాసుకుని తర్వాతే దానిచుట్టూ కథలు అల్లుకుంటున్నారేమో అనిపిస్తుంది. సిచ్యువేషన్ చూస్తుంటే..! చిన్న హీరోల నుంచి స్టార్స్ వరకు అంతా ఇదే దారిలో వెళ్తున్నారు. మరి ఆ ట్విస్టుల కథేంటో చూద్దామా..? క్లైమాక్స్ ట్విస్ట్ అనగానే వెంటనే గుర్తుకొచ్చే సినిమా పోకిరి.. అప్పట్లో పూరీ ఇచ్చిన ట్విస్టుకి అందరి బుర్రలు గిర్రున తిరిగాపోయాయి. ఆ తర్వాత ఆ రేంజ్ ట్విస్ట్ ఇచ్చిన సినిమా ఉప్పెన. ఈ ట్విస్ట్ మీద వచ్చినన్ని మీమ్స్ గత కొన్నేళ్లలో మరే సినిమాపై రాలేదు. అది అయినంత ట్రెండ్ ఇంకో సినిమా కాలేదు. ఏ ముహూర్తాన ఆ ట్విస్ట్ రాసుకున్నారో కానీ ఉప్పెన బ్లాక్‌బస్టర్ అవ్వడంతో ఆ మేజర్ మెలిక చాలా బాగా పని చేసింది. ఉప్పెన తర్వాత మొన్నటికి మొన్న రామ్ చరణ్ లాంటి పెద్ద హీరోతో చేసిన పెద్దిలో కూడా క్లైమాక్స్‌లో ఈ తరహాలోనే మరో ట్విస్ట్ రాసుకున్నారు బుచ్చిబాబు. చరణ్‌కు కాలు తీసేయడం అనేది పెద్దిలో అతిపెద్ద ట్విస్ట్. ఇది చూసాక బుచ్చిబాబుకు కట్టింగ్ మాస్టర్ అనే బిరుదు కూడా ఇచ్చేసారు మీమర్స్. నెక్ట్స్ సినిమాలో హీరోకు ఏం కట్ చేస్తాడో అంటూ ఛమక్కులు పేలుస్తున్నారు. కిరణ్ అబ్బవరం సెకండ్ ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేసిన క సినిమా కూడా ఒక్క ట్విస్ట్ చుట్టూనే తిరుగుతుంది. సినిమా అంతా ఒకెత్తు అయితే.. చివరి 2 నిమిషాలు మరో ఎత్తు. అప్పటి వరకు జరిగిన కథ అంతా అమ్మ కడుపు నుంచే అని తెలిసిన తర్వాత షాక్ అవ్వడం ఆడియన్స్ వంతు అవుతుంది. క విజయంలో ఆ ట్విస్ట్‌దే కీలక పాత్ర. మొన్న లెనిన్ కూడా అంతే.. సినిమాలో హీరోనే హీరోయిన్‌ని చంపేస్తాడు అనే ట్విస్ట్ చుట్టూనే కథ తిరుగుతుంది. అలాగే క్లైమాక్స్‌లో అఖిల్ విషయంలోనూ ఓ ట్విస్ట్ రాసుకున్నారు దర్శకుడు మురళీ కిషోర్. తాజాగా విడుదలైన చెన్నై లవ్ స్టోరీలోనూ ఇంటర్వెల్‌లోనే మేజర్ ట్విస్ట్ ఉంటుంది. అదే సినిమాకు ప్రాణం. దాని చుట్టూనే కథ అంతా అల్లుకున్నారు మేకర్స్. మొత్తానికి కథలన్నీ ట్విస్టుల చుట్టూ తిరుగుతున్నాయిప్పుడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చైనా సరికొత్త రోబో.. దీని స్పెషాలిటీ తెలిస్తే షాకవ్వాల్సిందే!

మన కరెన్సీపై పదేళ్ల ఆంక్షలకు తెర.. రూ.500 నోట్లకు నేపాల్ గ్రీన్ సిగ్నల్

ఇల్లు కొనడానికి పీఎఫ్ డబ్బులు తీస్తున్నారా? ఈ వార్త మీకోసమే!

ఓరి మీ కక్కుర్తి కూలా.. ఇదేం పనిరా సామీ!

ఇకపై నన్ను అలా పిలవొద్దు.. పవన్ అర్ధాంగి ఎమోషనల్ పోస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *