Headlines

ఓమై గాడ్.. అన్నా ఇది నువ్వేనా..! సమంతతో ఉన్నఈ హీరో ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు తెలుగులో తోపు | Did you know that Samantha acted in a movie with Rahul Ravindran, That is Moscowin Kaveri

ఓమై గాడ్.. అన్నా ఇది నువ్వేనా..! సమంతతో ఉన్నఈ హీరో ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు తెలుగులో తోపు | Did you know that Samantha acted in a movie with Rahul Ravindran, That is Moscowin Kaveri


ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న ఎం ముద్దుగుమ్మల్లో సమంత ఒకరు. ఒకప్పుడు ఈ అమ్మడు  వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేసింది. ఇక ఇప్పుడు ఆచి తూచి సినిమాలు చేస్తుంది. ఇటీవలే మా ఇంటి బంగారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది సామ్. నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో సమంత నటనతో పాటు యాక్షన్ సీన్స్ కూడా చేసి మెప్పించింది. రాజ్ తో వివాహం తర్వాత సామ్ మా ఇంటి బంగారం సినిమా చేసింది. త్వరలోనే సామ్ తల్లి కాబోతుంది. దాంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. సమంత సినీ జర్నీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఏం మాయ చేశావే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తక్కువ సమయంలోనే ఈ చిన్నది స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంది. బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాల్లో ఛాన్స్ అందుకుంది. తెలుగుతో పాటు, తమిళ్ ఇండస్ట్రీలోనూ సత్తా చాటింది.

ఇది కూడా చదివేయండి : రోజుకు 3లక్షలు రెమ్యునరేషన్.. మంచంపై నోట్ల కట్టలు పరుచుకుని పడుకునేది.. చివరకు అనాధలా చనిపోయింది

అలాగే హిందీలో సినిమాలు చేసింది సమంత. సామ్ కు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు చిన్మయి శ్రీపాద. చిన్మయి గ్రేట్ సింగర్.. ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సాంగ్స్ ఆలపించింది. ఈ ఇద్దరూ సమయం దొరికినప్పుడు కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చిన్మయి ఫ్యామిలీతో సమంత చాలా క్లోజ్ గా ఉంటుంది. చిన్మయి భర్త రాహుల్ కూడా సమంతకు మంచి స్నేహితుడు. రాహుల్ రవీంద్రన్ గురించి తెలిసే ఉంటుంది. ఒకప్పుడు హీరోగా చేసి ఇప్పుడు దర్శకుడిగా సినిమాలు చేసి మెప్పిస్తున్నాడు.

ఇది కూడా చదివేయండి : అతనికి 29, ఆమెకు 53..! 6 ఏళ్లుగా ఓటీటీని షేక్ చేస్తున్న రొమాంటిక్ సిరీస్.. ఎక్కడ చూడొచ్చంటే

అందాల రాక్షసి సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు రాహుల్. పలు సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ.. ఆశించిన స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకోలేకపోయాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో సహాయక పాత్రల్లో నటించాడు. ఇప్పటికీ నటిస్తున్నాడు. దర్శకుడిగా మరి చిలసౌ, ఇటీవల రశ్మికతో గర్ల్ ఫ్రెండ్ సినిమాలు చేశాడు. ఇదిలా ఉంటే రాహుల్ హీరోగా సమంత హీరోయిన్ గా కలిసి నటించారని మీకు తెలుసా..? చాలా మందికి తెలియకపోవచ్చు అవును రాహుల్ రవీంద్రన్, సమంత కలిసి నటించారు. ఇందుకు సంబందించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఒక తమిళ్ సినిమా.. అసలు ఈ సినిమా ఎప్పుడొచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా చాలా మందికి తెలియదు. అయితే ఈ సినిమాకు సంబందించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియోలో సమంత, రాహుల్ కలిసి అదరగొట్టారు. ఈ వీడియో పై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదెప్పుడు తీశారు అంటూ షాక్ అవుతున్నారు. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి



ఇది కూడా చదివేయండి : చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నాడు.. పెద్ద హీరో అవుతానుకుంటే.. 38ఏళ్ల వయసులోనే చనిపోయాడు



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *