కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): సెప్టెంబర్ నెల కర్కాటక రాశి వారికి ద్వితీయార్థం నుంచి మరింత అనుకూలంగా మారే అవకాశం ఉంది. రవి, కుజులతో పాటు శుక్రుడి అనుకూలత కూడా పెరగడంతో రాజయోగాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఏ రంగంలో ఉన్నవారైనా విజయాలు, సాఫల్యాలతో ముందుకు సాగే అవకాశం ఉంటుంది.
నెల ప్రథమార్థంలో ఇంటా, బయటా కొంత ఒత్తిడి ఎదురైనా ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేయగలుగుతారు. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన ప్రయత్నాలు చాలావరకు మంచి ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగంలో మీ ప్రాధాన్యం పెరగడంతో పాటు కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. మీ పనితీరుకు తగిన గుర్తింపు లభిస్తుంది.
అయితే నష్టదాయకమైన వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యంగా ఆర్థిక బాధ్యతలను ఇతరులకు అప్పగించకుండా స్వయంగా పర్యవేక్షించడం అవసరం. సొంత పనులపై మరింత శ్రద్ధ పెట్టడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు.
ఆరోగ్యపరంగా ఆహార, విహార విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. అనవసర ప్రయాణాలు, అజాగ్రత్తలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ జీవితం సాధారణంగా ప్రశాంతంగా సాగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభించే అవకాశం ఉంది.
ఆధ్యాత్మికంగా సుందరకాండ పారాయణం చేయడం వల్ల నెల ప్రథమార్థంలోని ప్రతికూల పరిస్థితులు తగ్గి, మానసిక ప్రశాంతతతో పాటు శుభ ఫలితాలు పొందే అవకాశం ఉందని జ్యోతిష్య సూచనలు చెబుతున్నాయి.