కాంచీపురం అమ్మవారి ఆలయ ఉత్సవాల్లో తీవ్ర విషాదం వెలుగు చూసింది. అమ్మవారి దర్శనానికి వచ్చిన రెండు వర్గాలకు చెందిన భక్తుల మధ్యలో ఘర్షణ చోటుచేసుకుంది. చిన్నగా మొదలైన గొడవ తీవ్ర స్థాయికి చేరడంతో పరస్పరం ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు ఇరు వర్గాలు. ఈ దాడిలో ఇద్దరు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 20 మందిదాక గాయపడ్డట్టు తెలుస్తోంది. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.