Headlines

చంద్ర మంగళ యోగం.. వారి కోరికలు నెరవేరడం పక్కా..! డబ్బుకు ఢోకా ఉండదు.. | Chandra Mangal Yoga: These 6 Zodiac Signs May See Their Dreams and Financial Goals Come True


గ్రహచారంలో చంద్ర, కుజులు కలిసి ఉన్న మూడు రోజుల కాలంలో ఎటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా, ఎటువంటి కలలు కన్నా అవి తప్పకుండా సాకారం అవుతాయి. చంద్ర మంగళ యోగం అనుకూలంగా ఉంటే చాలు, ఆ రాశులవారికి దారిద్ర్యం అంటదని, ఆర్థిక సమస్యలు దగ్గరికి రావని, ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. చంద్ర, కుజులు ఒకరికొకరు కేంద్రాల్లో అంటే 1, 4, 7, 10 స్థానాల్లో ఉన్నప్పుడు ఈ యోగం పడుతుంది. ఈ యోగం పడితే సంపాదన ఉన్నత స్థాయిలో ఉంటుంది. ఈ నెల (సెప్టెంబర్) 5, 6, 7 తేదీల్లో కుజ, చంద్రులు మిథున రాశిలో కలుసుకోబోతున్న వేళ మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, మీనం రాశులవారి లక్ష్యాలు, కోరికలు నెరవేరబోతున్నాయి. ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది.

మేషం

ఈ రాశివారికి తృతీయ స్థానంలో కుజ, చంద్రులు కలవడం వల్ల ఈ రాశివారు కొత్త లక్ష్యాలను నిర్దే శించుకుని వాటిని నెరవేర్చుకునే అవకాశం ఉంది. వీరు వివాదాలు, సమస్యల నుంచి బయట పడడం మీదా, వ్యక్తిగత జీవితంలో పురోగతి చెందడం మీదా దృష్టి పెట్టడం మంచిది. కొద్ది ప్రయ త్నంతో పోటీదార్లపై విజయం సాధిస్తారు. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి.

మిథునం

ఈ రాశిలో చంద్ర కుజులు కలుస్తున్నందువల్ల ఈ రాశివారి వ్యూహాలు, ప్రణాళికలు తప్పకుండా సక్సెస్ అవుతాయి. ఆదాయ వృద్ధికి వీరు సరికొత్త మార్గాలను అనుసరించడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో మీ ఆలోచనలు, వ్యూహాలు ఫలించి రాబడి పెరుగుతుంది. స్థిరాస్తి వ్యాపారాలు అభి వృద్ధి చెందుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. విదేశీ సంపాదన యోగం పడుతుంది. ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది.

ఇవి కూడా చదవండి



సింహం

ఈ రాశికి లాభ స్థానంలో ఈ ధన యోగం ఏర్పడుతున్నందువల్ల, ఆస్తి, వ్యక్తిగత సమస్యల పరి ష్కారం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వాస్తవానికి కొద్ది ప్రయత్నంతో వీరి లక్ష్యాలు, ఆశయాలు నెర వేరడానికి బాగా అవకాశం ఉంది. ఆదాయాన్ని ఇళ్లు, స్థలాలు, పొలాల మీద పెట్టుబడిగా పెట్టడం వల్ల ఉత్తరోత్రా లాభం ఉంటుంది. తల్లి వైపు నుంచి సంపద కలిసి వస్తుంది. గతంలో పెట్టిన పెట్టు బడుల నుంచి ఆశించిన ప్రతిఫలం దక్కుతుంది. రాదనుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది.

తుల

ఈ రాశికి భాగ్య స్థానంలో ఈ యోగం పడుతున్నందువల్ల విదేశీ ఉద్యోగ ప్రయత్నాల మీద దృష్టి పెట్టడం మంచిది. వీరి లక్ష్యాలు, ఆశయాలు నెరవేరడానికి ఇంతకన్నా మంచి సమయం ఉండక పోవచ్చు. అప్రయత్న ధనలాభానికి, ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. జీతభత్యాల పరంగా కూడా ఆదాయం పెరిగే సూచనలున్నాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆస్తి, వివాదాలు, కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి.

ధనుస్సు

ఈ రాశికి సప్తమ స్థానంలో ఈ యోగం చోటు చేసుకోవడం ఒక విధంగా అదృష్టమనే చెప్పాలి. ఈ రాశివారు భాగస్వామ్య వ్యాపారాలను చేపట్టడం చాలా మంచిది. వృత్తి, వ్యాపారాల్లో వీరి లక్ష్యాలు తప్పకుండా నెరవేరుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. ఏ ప్రయత్నం చేపట్టినా సఫలమవుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం గానీ, పెళ్లి నిశ్చయం కావడం గానీ జరుగుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి.

మీనం

ఈ రాశికి చతుర్థ స్థానంలో చంద్ర మంగళ యోగం ఏర్పడుతున్నందు వల్ల గృహ, వాహన సౌకర్యాల్ని లక్ష్యంగా చేసుకోవడం మంచిది. కొద్ది ప్రయత్నంతో ఇళ్లు, స్థలాలు, వాహనాలు కొనే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టడానికి ఇది బాగా అనుకూల సమయం. ఆదా యం బాగా వృద్ధి చెందుతుంది. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, లిక్కర్, ఆభరణాలు వంటి రంగాల ద్వారా ఆదాయం పెరగడం లేదా ఈ రంగాలపై పెట్టుబడులు పెట్టడం వల్ల లబ్ధి పొందడం జరుగుతుంది.

Also Read: ఈ నెలంతా వారికి లక్ష్మీ కటాక్షం..ఆకస్మిక ధనలాభం ఖాయం..!

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *