Headlines

దుబాయ్ టు ముంబై.. విమానం గాల్లో ఉండగా కార్గో హోల్డ్‌ నుంచి పోగ.. ఆ తర్వాత ఏమైందంటే.. | Dubai Mumbai IndiGo Flight With 194 Onboard Makes Emergency Landing In Rajkot

దుబాయ్ టు ముంబై.. విమానం గాల్లో ఉండగా కార్గో హోల్డ్‌ నుంచి పోగ.. ఆ తర్వాత ఏమైందంటే.. | Dubai Mumbai IndiGo Flight With 194 Onboard Makes Emergency Landing In Rajkot


రాజ్‌కోట్‌లో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది.. కార్గో హోల్డ్‌లో పొగలు గుర్తించడంతో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. దుబాయ్ నుంచి ముంబై వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలోని 194 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం దుబాయ్ నుంచి ముంబై వస్తుండగా.. ఇండిగో విమానం కార్గో హోల్డ్ లో పైలట్‌కు పొగ కనిపించడంతో సోమవారం రాజ్‌కోట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయినట్లు ఏటీసీ అధికారులు తెలిపారు. పైలట్ సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్తగా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్సులు మోహరించారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయి ఒక పెద్ద ప్రమాదం తప్పింది. అనంతరం ప్రయాణీకులందరినీ విమానం నుండి సురక్షితంగా తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, పైలట్ పొగను గమనించిన తర్వాత రాజ్‌కోట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)ని సంప్రదించి, అత్యవసర ల్యాండింగ్ కోసం అభ్యర్థించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారని, వారిని సురక్షితంగా తరలించామని రాజ్‌కోట్ పోలీస్ కమిషనర్ తెలిపారు.

ఇటీవలి నెలల్లో ఇండిగో విమానానికి సంబంధించి ఇది రెండవ అత్యవసర పరిస్థితి అని అధికారులు తెలిపారు. మే నెలలో, హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళ్తున్న ఇండిగో విమానాన్ని ఖాళీ చేయించారు. విమానంలో ఒక ప్రయాణికుడి పవర్ బ్యాంక్‌లో అంతర్గత పేలుడు సంభవించి, క్యాబిన్ అంతా పొగతో నిండిపోవడంతో ఖాళీ చేయించారు 198 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో కూడిన విమానం షహీద్ భగత్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగి, బే వైపు వెళ్తుండగా, ఒక ప్రయాణికుడు మంటల గురించి సిబ్బందిని అప్రమత్తం చేశాడు. క్యాబిన్ సిబ్బంది త్వరగా మంటలను ఆర్పివేసినప్పటికీ, పొగ అప్పటికే క్యాబిన్ అంతటా వ్యాపించడంతో, గాలితో నింపిన స్లైడ్‌లను ఉపయోగించి అత్యవసరంగా ఖాళీ చేయించాల్సి వచ్చింది. తరలింపు సమయంలో ఒక ప్రయాణికుడు గాయపడగా, మిగిలిన వారందరూ సురక్షితంగా విమానం నుండి దిగారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *