Headlines

నన్ను క్షమించమ్మా.. మీ ఆశలు నెరవేర్చలేకపోయా.. కన్నీళ్లు పెట్టిస్తున్న నీట్ విద్యార్థిని సూసైడ్ లేఖ.. | 19 Year Old Maharashtra Girl takes her own life After NEET 2026 Re test Results

నన్ను క్షమించమ్మా.. మీ ఆశలు నెరవేర్చలేకపోయా.. కన్నీళ్లు పెట్టిస్తున్న నీట్ విద్యార్థిని సూసైడ్ లేఖ.. | 19 Year Old Maharashtra Girl takes her own life After NEET 2026 Re test Results


మరో నీట్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. అహిల్యానగర్ జిల్లాలోని జలాల్‌పూర్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల అంకితా సంగాలే అనే విద్యార్థిని ఆదివారం తన నివాసంలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అంకిత ఆన్‌లైన్ కోచింగ్ తీసుకుని నీట్ పరీక్షకు సిద్ధమైంది. అయితే ఇటీవల వెలువడిన నీట్ రీ ఎగ్జామ్ ఫలితాల్లో ఆమెకు కేవలం 166 మార్కులు మాత్రమే వచ్చాయి. ఈ ఏడాది కట్ ఆఫ్ మార్కులు 177గా ఉండటంతో సీటు రాదన్న నిరాశతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆదివారం సాయంత్రం తల్లిదండ్రులు, సోదరుడు పనిమీద బయటకు వెళ్లిన సమయంలో తన స్టడీ రూమ్‌లోనే సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపులు బద్దలుగొట్టి చూడగా అంకిత ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది.

మిమ్మల్ని కలిచివేస్తున్నా.. నన్ను క్షమించండి

సమాచారం అందుకున్న కర్జత్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో మరాఠీ భాషలో రాసిన చేతివ్రాత డెత్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘‘అమ్మా, నాన్న.. నన్ను ఎంతో ప్రేమించారు, కానీ మీ ఒక్క కోరికను కూడా నేను నెరవేర్చలేకపోయాను. అమ్మా, నువ్వు ప్రతి కష్టంలో నాకు స్నేహితురాలిగా తోడున్నావ్. అన్నయ్య.. నువ్వు నన్ను అమ్మానాన్నల కంటే ఎక్కువగా ప్రేమించావ్. నా ఆత్మహత్యకు మీరెవరూ బాధ్యులు కారు. నీట్ కోసం నేను చదువుకుంటున్నప్పుడు నా కోసం అంతా త్యాగం చేశారు. కానీ నేను పరీక్షలో విఫలమై మీ ఆశలను నెరవేర్చలేకపోయాను’’ అని అంకిత్ అందులో రాసుకొచ్చింది. కాగా తాను ఒక సాధారణ విద్యార్థినినని, కుటుంబ సభ్యుల అంచనాలను అందుకోలేకపోయానని ఆమె ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది. కర్జత్ సీనియర్ ఇన్స్‌పెక్టర్ హనుమాన్ గైక్వాడ్ నేతృత్వంలో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

పేపర్ లీకేజీయే కారణమంటూ ఎంపీ నిలేష్ లంకే మండిపాటు

సమాచారం అందుకున్న స్థానిక ఎంపీ నిలేష్ లంకే విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మే 3న జరిగిన నీట్ పరీక్షలో అంకితకు మంచి మార్కులే వచ్చాయని.. కానీ పేపర్ లీకేజీ కారణంగా ఆ పరీక్ష రద్దై, మళ్లీ రీ ఎగ్జామ్ నిర్వహించడం వల్లనే ఈ దుస్థితి వచ్చిందని ఆరోపించారు. పేపర్ లీకేజీకి బాధ్యులైన వారిపై హత్య కేసు నమోదు చేయాలని, ఈ మరణానికి ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని ఆయన డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *