దోశ పిండి పక్కా కొలతలు: 1 గ్లాసు మినపగుళ్లు, 3 గ్లాసుల బియ్యం, పావు గ్లాసు పచ్చి శనగపప్పు (దోశ మంచి కలర్, క్రిస్పీనెస్ రావడానికి), 2 టీస్పూన్లు మెంతులు, అర గ్లాసు దొడ్డు అటుకులు దోశ మృదువుగా, కరకరలాడుతూ రావడానికి వీటన్నింటినీ శుభ్రంగా కడిగి మంచి నీటితో కనీసం 3 గంటల పాటు నానబెట్టాలి. నానిన తర్వాత అదే నీటిని కొద్దికొద్దిగా పోస్తూ మెత్తగా, కాస్త గట్టిగా గ్రైండ్ చేసి రాత్రంతా లేదా 8 గంటల పాటు పులియబెట్టుకోవాలి.