Headlines

పరగడుపున ఉప్పు నీళ్లు తాగుతున్నారా? శరీరంలో జరిగే మార్పులివే.. | Drinking Salt Water on an Empty Stomach: Benefits, Risks and Who Should Avoid It


సాధారణంగా ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరమని వైద్యులు చెబుతుంటారు. అయితే, ఉదయాన్నే పరగడుపున రిఫైన్డ్ సాల్ట్ కాకుండా హిమాలయన్ పింక్ సాల్ట్, రాక్ సాల్ట్ లేదా పింక్ సాల్ట్ కలిపిన నీటిని తాగడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది:

ఉదయాన్నే పరగడుపున ఉప్పు నీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది కడుపులో ఆహారాన్ని అరిగించే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఫలితంగా అజీర్తి, కడుపు ఉబ్బరం , గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుముఖం పడతాయి. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పేగుల కదలికలు సులువై, దీర్ఘకాలిక మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

డీహైడ్రేషన్ నివారణ, శక్తి పెరుగుదల:

ఉదయం లేవగానే తాగే ఉప్పు నీరు శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లను అందిస్తుంది. ఇది శరీరం నీటిని బాగా పీల్చుకునేలా చేసి డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. ప్రతిరోజూ ఉదయాన్నే జిమ్‌కు వెళ్లేవారు లేదా వర్కౌట్స్ చేసేవారు వ్యాయామానికి ముందు ఈ నీటిని తాగితే, శరీరం వేగంగా అలసిపోకుండా రోజంతా ఉత్సాహంగా ఉండటానికి అవసరమైన శక్తి లభిస్తుంది.

ఇవి కూడా చదవండి



చర్మ సౌందర్యం, శ్వాసకోశ ఆరోగ్య ప్రయోజనాలు:

ఉప్పు నీటిలో ఉండే సహజసిద్ధమైన ఖనిజాలు చర్మాన్ని లోపలి నుండి హైడ్రేట్‌గా ఉంచుతాయి. ఇది ఎక్జిమా, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే శ్వాసకోశ సంబంధిత సమస్యలైన దగ్గు, జలుబు, గొంతు అలర్జీ ఉన్నవారికి ఇది అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. గొంతు నొప్పితో బాధపడేవారు ఉప్పు నీటితో పుక్కిలిస్తే వెంటనే ఉపశమనం లభించడమే కాకుండా, శరీర రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

పరగడుపున ఉప్పు నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీ సమస్యలతో బాధపడేవారు మాత్రం ఈ అలవాటుకు దూరంగా ఉండాలని లేదా వైద్యుల సలహా మేరకు మాత్రమే నడుచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *