అయితే ఇంటి వద్ద ఉండకూడని ఈ మొక్కను పూజించడం వలన అష్టైశ్వార్యాలు కలుగుతాయని చెబుతున్నారు పండితులు. తెల్ల జిల్లేడు మొక్క ఇంటికి అదృష్టాన్ని తీసుకొస్తుందంట. దీనని పూజించడం వలన జీవితంలోని అనేక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు పండితులు.
ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడే వారు తెల్ల జిల్లేడు మొక్కను పూజించడం వలన అప్పుల బాధల నుంచి చాలా త్వరగా బయటపడతారు. ముఖ్యంగా తెల్ల జిల్లేడు మొక్కలోనే ధనలక్ష్మీ కొలువై ఉంటుందని చెబుతుంటారు. అందువలన ఎవరు అయితే ఈ మొక్కను పూజిస్తారో వారి అప్పులు తీరిపోయి, సంపద పెరుగుతందంట. దీంతో పేదరికం నుంచి కూడా చాలా త్వరగా బయటపడతారంట. అందుకే పేదరికంతో బాధ పడే వారు దీనిని పూజించడం చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు.
అలాగే ఏ మొక్కను అయినా సరే సరైన పద్ధతిలో పూజించినప్పుడే దాని పూర్తి ఫలితాలు దక్కుతాయని చెబుతుంటారు. అయితే ఈ తెల్ల జిల్లేడు మొక్క విషయంలో కూడా అంతేనంట. తెల్ల జిల్లేడు మొక్కకు, శుక్రవారం లేదా ఆది వారం ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు చేయడం , మొక్క చుట్టూ ప్రదిక్షణలు చేయడం చాలా మంచిదంట. పూజ చేసే సమయంలో ముందుగా ఈ చెట్టు మెదలును శుభ్రం చేయాలి.
తర్వాత మొక్క మెదలును పసుపు, కుంకుమలతో అందంగా అలంకరించాలి. తర్వాత బియ్యం పోసి, ఒక రూపాయి నాణెం, తెల్లని తియ్యటి స్వీట్ సమర్పించాలి. ఇలా మూడు వారాలు చేయడం వలన మీ అదృష్టం మారిపోతుందని చెబుతున్నారు నిపుణులు. అలాగే ఎప్పుడూ కూడా పూజ చేసే సమయంలో మనసు చాలా నిశ్చలంగా ఉంచుకోవాలంట.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు




