సాంప్రదాయ ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన ఉసిరి, మునగాకు మిశ్రమాన్ని ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం ఇప్పుడు ఒక ప్రముఖ హెల్త్ ట్రెండ్‌గా మారింది. దీని వెనుక ఉన్న శాస్త్రీయ నిజాలు, ప్రతిరోజూ ఈ గ్రీన్ షాట్ తాగడం వల్ల శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఏంటో చూద్దాం. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.
సహజసిద్ధమైన విటమిన్ సీ బూస్టర్:
ఉసిరిలో నారింజ పండ్ల కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. మునగాకులోని ఐరన్, క్యాల్షియంతో ఇది కలిసినప్పుడు, శరీరం ఐరన్‌ను సులభంగా శోషించుకుంటుంది. ఇది సింథటిక్ సప్లిమెంట్లతో పనిలేకుండా సహజంగా రోగనిరోధక శక్తిని, శక్తి స్థాయిలను పెంచుతుంది.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది:
ఇది కడుపులోని గ్యాస్ట్రిక్ జ్యూస్‌లను, లివర్ ఎంజైమ్‌లను ఉత్తేజపరుస్తుంది. మునగాకులోని యాంటీబాక్టీరియల్ గుణాలు పేగులలోని మంచి బాక్టీరియాను కాపాడతాయి. క్రమం తప్పకుండా తాగడం వల్ల మలబద్ధకం తగ్గి పేగులు శుభ్రపడతాయి. ఈ జ్యూస్ తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. ఇది పేగుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపి, శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది. మలబద్ధకం, జీర్ణకోశ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
ఇవి కూడా చదవండి
మానసిక ఏకాగ్రత, బ్రెయిన్ పవర్:
ఉసిరి, మునగాకులలోని క్వెర్సెటిన్, క్లోరోజెనిక్ యాసిడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు మెదడు కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తాయి. దీనివల్ల బ్రెయిన్ ఫాగ్ తగ్గి, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి.
కాలేయ ఆరోగ్యం:
అనారోగ్యకరమైన జీవనశైలి వల్ల కాలేయంలో కొవ్వు చేరుకోవడాన్ని మునగాకు తగ్గిస్తుంది. అలాగే, ఉసిరి శరీరంలోని అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ అయిన గ్లుటాథియోన్ను పెంచి కాలేయాన్ని సహజంగా డిటాక్స్ చేస్తుంది.
కండరాల పునరుద్ధరణ :
మొక్కల ఆధారిత ఆహారాలలో అరుదుగా లభించే 9 అత్యవసర అమైనో ఆమ్లాలు మునగాకులో ఉన్నాయి. ఉదయాన్నే ఇవి శరీరానికి అందడం వల్ల వ్యాయామం, యోగా చేసిన తర్వాత వచ్చే కండరాల నొప్పులు త్వరగా తగ్గుతాయి.
రోగనిరోధక శక్తి పెరుగుదల:
ఉసిరిలో ఉండే సమృద్ధియైన విటమిన్ సి, మునగాకులోని ఐరన్, క్యాల్షియం, జింక్, విటమిన్ ఏ శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఇవి వాతావరణ మార్పుల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తాయి.
చర్మ సౌందర్యం, జుట్టు బలం:
ఉసిరిలోని విటమిన్ సి చర్మానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మంలోని నల్లటి మచ్చలను తొలగించి, చర్మాన్ని సహజ సిద్ధంగా మెరిసేలా చేస్తాయి. జుట్టు రాలడానికి కారణమయ్యే DHT హార్మోన్‌ను అదుపులో ఉంచుతుంది. మునగాకులోని జింక్, విటమిన్ ఏ చర్మానికి లోతైన హైడ్రేషన్ అందించి సహజ కాంతినిస్తాయి. ఇందులోని అమైనో ఆమ్లాలు జుట్టు కుదుళ్లను దృఢంగా మార్చి, చుండ్రును నివారిస్తాయి.
బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ నియంత్రణ:
మునగాకు, ఉసిరి, కరివేపాకు కాంబినేషన్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది. ముఖ్యంగా టిఫిన్ చేసిన తర్వాత బ్లడ్ షుగర్ పెరగకుండా చూస్తుంది. అంతేకాకుండా, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
జ్యూస్ తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు:
ఉసిరికాయలు – 2, మునగాకు – ఒక గుప్పెడు లేదంటే మునగాకు పొడి 1 స్పూన్, కరివేపాకు – ఒక గుప్పిడు, జీలకర్ర – 1/4 స్పూన్, మిరియాలు – 6, అల్లం – చిన్న ముక్క, పసుపు – 2 చిటికెట్లు, పింక్ సాల్ట్– తగినంత తీసుకోవాలి.
తయారుచేసే పద్ధతి:
ఉసిరికాయలను చిన్న ముక్కలుగా కోసి మిక్సీ జార్లో వేయండి. శుభ్రం చేసిన మునగాకు, కరివేపాకు, అల్లం, జీలకర్ర, మిరియాలు, పసుపు, ఒక గ్లాసు నీటిని కలిపి మెత్తగా గ్రైండ్ చేయండి. ఈ మిశ్రమాన్ని వడకట్టి, అందులో కొద్దిగా పింక్ సాల్ట్ కలిపితే హెల్తీ మొరింగా – ఆమ్లా షాట్ రెడీ అవుతుంది. చిన్నపిల్లలకు ఇచ్చేటప్పుడు కాస్త తేనె కలిపి ఇవ్వవచ్చు. ప్రతిరోజూ ఉదయాన్నే ఈ జ్యూస్ తాగడం వల్ల నీరసం తగ్గి రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..