Headlines

పాములు ఎన్ని రోజులకు ఒకసారి మల మూత్ర విసర్జనలు చేస్తాయో తెలుసా? | Do Snakes Urinate and Defecate? Surprising Facts About Snake Excretion Explained

పాములు ఎన్ని రోజులకు ఒకసారి మల మూత్ర విసర్జనలు చేస్తాయో తెలుసా? | Do Snakes Urinate and Defecate? Surprising Facts About Snake Excretion Explained


పాముల గురించి ఎన్నో అపోహలు, సందేహాలు ప్రజల్లో ఉంటాయి. వాటిలో ఒకటి ఏంటంటే.. పాములు మల, మూత్ర విసర్జన చేస్తాయా? లేదా అన్నది. చాలా మంది పాములు ఆహారం తింటాయని తెలుసు కానీ, వాటి శరీరం వ్యర్థాలను ఎలా బయటకు పంపుతుందో తెలియదు. అయితే జీవశాస్త్ర నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం.. పాములు కూడా ఇతర జంతువుల మాదిరిగానే మల, మూత్ర విసర్జన చేస్తాయి. అయితే వాటి విధానం మనుషులు, ఇతర క్షీరదాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది.

మలంలో ఎముకలు, వెంట్రుకలు, ఈకలు

పాము తిన్న ఆహారం పూర్తిగా జీర్ణమైన తర్వాత మిగిలిన ఘన వ్యర్థాలు మలంగా బయటకు వస్తాయి. పాములు ఎలుకలు, కప్పలు, పక్షులు వంటి జీవులను మింగి తింటాయి. వాటిలో జీర్ణం కాని ఎముకలు, వెంట్రుకలు, ఈకలు వంటి పదార్థాలు చివరకు మల రూపంలో బయటకు వెళ్లిపోతాయి. మూత్ర విసర్జన విషయంలో మాత్రం పాములు ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తాయి. మనుషుల మాదిరిగా ఎక్కువగా ద్రవ మూత్రాన్ని విసర్జించకుండా, శరీరంలోని నైట్రోజన్ వ్యర్థాలను యూరిక్ యాసిడ్ అనే తెల్లటి, చిక్కటి పదార్థంగా బయటకు పంపిస్తాయి. ఇది పక్షుల విసర్జనలో కనిపించే తెల్లటి భాగాన్ని పోలి ఉంటుంది. ఈ విధానం వల్ల పాముల శరీరంలో నీటి నష్టం తక్కువగా ఉండి, తక్కువ నీటితో కూడా ఎక్కువకాలం జీవించగలుగుతాయి.

వారానికి ఒకసారి..

పాముల్లో మలం, యూరిక్ యాసిడ్ రెండూ క్లోయాకా (Cloaca) అనే ఒకే రంధ్రం ద్వారా బయటకు వస్తాయి. ఇదే రంధ్రాన్ని అవి ప్రజనన ప్రక్రియకు కూడా ఉపయోగిస్తాయి. అంటే పాములకు మనుషుల మాదిరిగా మలం, మూత్రం కోసం వేర్వేరు రంధ్రాలు ఉండవు. పాములు ఎంత తరచుగా విసర్జిస్తాయనేది అవి తిన్న ఆహారం, పరిమాణం, వాతావరణ ఉష్ణోగ్రత వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. చిన్న పాములు కొద్ది రోజులకోసారి విసర్జించవచ్చు. పెద్ద పాములు మాత్రం పెద్ద ఆహారం తిన్న తర్వాత కొన్ని వారాలకోసారి మాత్రమే విసర్జించే సందర్భాలు కూడా ఉంటాయి.

ఇది కూడా చదవేయండి: అబ్బ.. ఈ పాము ఒక్కటి దొరికితే చాలు లైఫ్ సెట్టు! ధర తెలిస్తే ఇప్పుడే వెతికేందుకు వెళ్తారు..

వన్యప్రాణి నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పాములు మల, మూత్ర విసర్జన చేయవని అనుకోవడం పూర్తిగా అపోహ మాత్రమే. ప్రకృతిలోని ప్రతి జీవిలాగే పాముల శరీరం కూడా జీవక్రియల ద్వారా ఏర్పడే వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. కాకపోతే వాటి శరీర నిర్మాణం, నీటిని ఆదా చేసే జీవన విధానం కారణంగా ఆ ప్రక్రియ మనకు భిన్నంగా కనిపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *