Headlines

పిల్లల నుంచి పెద్దల వరకు మొనగాడు ఫుడ్.. ఉదయాన్నే గిన్నెడు తింటే మీ ఆరోగ్యానికి తిరుగుండదు.. | Healthy Breakfast: How Daily Oats Improve Heart Health, Diabetes Control and Weight Loss, Benefits of Oats

పిల్లల నుంచి పెద్దల వరకు మొనగాడు ఫుడ్.. ఉదయాన్నే గిన్నెడు తింటే మీ ఆరోగ్యానికి తిరుగుండదు.. | Healthy Breakfast: How Daily Oats Improve Heart Health, Diabetes Control and Weight Loss, Benefits of Oats


ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత పెరిగింది. ఈ క్రమంలో, ఓట్స్ అనేక మందికి అల్పాహారంలో ఒక భాగంగా మారింది. ఓట్స్‌ను కేవలం ఉదయం మాత్రమే కాకుండా, రాత్రి సమయంలోనూ ఆహారంగా తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఓట్స్‌ను రుచికి తగ్గట్లు వివిధ రకాల పద్ధతుల్లో తయారు చేసుకోవచ్చు. ఇది వాటిని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. ఓట్స్‌లో ఎన్నో పోషకాలు, ఖనిజాలు ఉంటాయి.. అందుకే.. ఓట్స్ ను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆహార నిపుణులు చెబుతున్నారు..

ఓట్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ డైటరీ ఫైబర్ జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి కీలకం.. ఇది మలబద్ధకం వంటి జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. తద్వారా అధిక బరువును తగ్గించడంలో, బరువు నియంత్రణలో ఇది సహాయపడుతుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఓట్స్ ఒక అద్భుతమైన ఆహారం. ఓట్స్‌లోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. షుగర్ లెవల్స్ అదుపులో ఉంచుకోవడానికి తోడ్పడుతుంది. ఇది గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఆహారం కాబట్టి, రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా విడుదలవుతాయి.

ఓట్స్‌లో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను నశింపజేస్తాయి. తద్వారా కణాలకు కలిగే నష్టాన్ని నివారిస్తాయి. కణాలు సురక్షితంగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఓట్స్‌లో కార్బోహైడ్రేట్లు, ఫైబర్ మాత్రమే కాకుండా విటమిన్లు, మినరల్స్, అలాగే యాంటీఆక్సిడెంట్ ప్లాంట్ కాంపౌండ్స్ కూడా హెచ్చుగా లభిస్తాయి. వీటిని ప్రాసెస్ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.. సులభంగా తయారు చేసుకోవచ్చు.

ఓట్స్ తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీనివల్ల త్వరగా ఆకలి వేయదు.. అనవసరమైన చిరుతిళ్లు తినకుండా నియంత్రిస్తుంది. ఇది బరువు తగ్గడానికి, నిర్వహణకు చాలా ముఖ్యం.

గుండె ఆరోగ్యం విషయంలోనూ ఓట్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతిరోజూ ఓట్స్ తినడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గుతుంది. ఇది హార్ట్ ఎటాక్ లు రాకుండా జాగ్రత్తగా ఉండటానికి సహాయపడుతుంది. హై బీపీ (అధిక రక్తపోటు) సమస్య ఉన్నవారికి ఓట్స్ ఎంతగానో మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగుపడుతుంది.. బీపీ తగ్గుతుంది. తద్వారా గుండె జబ్బులు రాకుండా కూడా ఓట్స్ చూసుకోవచ్చు.

పిల్లల ఆరోగ్యానికి కూడా ఓట్స్ ఎంతో ప్రయోజనకరం. సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో, చిన్నారులకు ఓట్స్ తినిపించడం వల్ల వారిలో ఆస్తమా ఎటాక్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయని వెల్లడైంది. ఇది పిల్లల శ్వాసకోశ ఆరోగ్యానికి ఒక రక్షణగా నిలుస్తుంది.

అదనంగా, ఓట్స్‌లో ఉండే సిలికాన్ ఆమ్లం జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. జుట్టును బలంగా ఉంచుతుంది. కనుక, ఓట్స్ ను రోజువారీ ఆహారంలో.. ముఖ్యంగా అల్పాహారంలో చేర్చడం వల్ల అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు. సులభంగా లభించే, రుచికరమైన, ఆరోగ్యకరమైన ఓట్స్ మీ రోజును ఆరోగ్యకరంగా ప్రారంభించడానికి ఉత్తమ మార్గమని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *