Headlines

ఫేక్ కలెక్షన్స్.. కుండ బద్ధలు కొట్టిన నిర్మాతలు..! | Tollywood Fake Collections Controversy: Why Producers Inflate Box Office Numbers and Is the Trend Hurting the Film Industry video tv9d – Entertainment Videos in Telugu


టాలీవుడ్‌లో ఇప్పుడెక్కడ చూసినా ఫేక్ కలెక్షన్స్ గురించే చర్చ జరుగుతోంది. అసలు పోస్టర్ల మీద వేస్తున్న వందల కోట్ల నంబర్లలో నిజమెంత..? కేవలం హీరోల ఫ్యాన్స్‌ను ఖుషీ చేసి సోషల్ మీడియాలో హైప్ పెంచడానికే నిర్మాతలు ఇలా ఫేక్ కలెక్షన్స్ వేస్తున్నారా..? కొందరు నిర్మాతలు దీన్ని మార్కెటింగ్ స్ట్రాటజీ అంటుంటే మరికొందరు మాత్రం ఇది ఇండస్ట్రీకి నష్టమని ఎందుకు భయపడుతున్నారు..? ఈ మధ్యే రోమాంచకం సక్సెస్ మీట్‌లో నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా చేసిన కామెంట్స్‌‌తో టాలీవుడ్‌లో ఫేక్ కలెక్షన్స్ మీద మరోసారి చర్చ మొదలైంది. ఫేక్ చూపించి క్రేజ్ పెంచుకోవడం ఇండస్ట్రీకి ఏమాత్రం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. చాలా మంది ఓవర్ చేసి చెప్తుంటారు కానీ అది అవసరం లేదు.. కంటెంట్ బాగుంటే సినిమానే మాట్లాడుతుందన్నారు ప్రణయ్. ఈ ఫేక్ కలెక్షన్స్ ట్రెండ్‌పై మైత్రి మూవీ మేకర్స్ నవీన్ యేర్నేని కూడా స్పందిస్తూ.. ఆరోజు ఉన్న పరిస్థితుల డిమాండ్ బట్టే అలా ఫేక్ నంబర్స్ వేయాల్సి వస్తుందని ఇరుముడి సక్సెస్ మీట్‌లో చెప్పుకొచ్చారు. పోస్టర్స్ మీద కనిపించే కలెక్షన్స్ పక్కా ఫేక్ అని నిర్మాత నాగవంశీ ఓపెన్‌గానే ఒప్పేసుకున్నారు.. కేవలం ఫ్యాన్స్ కోసం, మార్కెటింగ్ క్రేజ్ కోసమే ఆ నంబర్స్ వేస్తున్నామని కుండబద్దలు కొట్టారు. అసలైన బాక్సాఫీస్ నంబర్స్ కేవలం నిర్మాతకు మాత్రమే తెలుస్తాయని, హీరోలను ఇంప్రెస్ చేయడానికి, ఫ్యాన్ వార్స్ కోసమే ఫేక్ వేయాల్సి వస్తుందని నాగవంశీతో పాటు దిల్ రాజు కూడా చెప్పారు. కాకపోతే ఫేక్ వేసి రేంజ్ పెంచడం వల్ల హీరోలు, డైరెక్టర్ల మార్కెట్ వాల్యూ దారుణంగా పడిపోతుందని ప్రణయ్ రెడ్డి హెచ్చరించారు. ప్రేక్షకులను మభ్యపెట్టడం మానేసి రియల్ నెంబర్స్ వేయాలన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!

దుబాయ్‌లో సింగిల్‌ రూమ్‌ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!

అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!

పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు

హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ఇక.. మెట్రో, ఆర్టీసీ ప్రయాణం మరింత సులభం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *