Headlines

బద్దలైన ధోనీ ఆల్‌టైమ్ రికార్డ్.. టీ20 చరిత్రలోనే తోపు కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్..! | Shreyas iyer breaks ms dhoni record most consecutive t20i toss wins

బద్దలైన ధోనీ ఆల్‌టైమ్ రికార్డ్.. టీ20 చరిత్రలోనే తోపు కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్..! | Shreyas iyer breaks ms dhoni record most consecutive t20i toss wins


భారత టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి శ్రేయస్ అయ్యర్‌కు మైదానంలో ఆశించిన విజయాలు దక్కకపోవచ్చు గానీ, టాస్ విషయంలో మాత్రం అతడి అదృష్టం మైండ్ బ్లాక్ చేస్తోంది. జింబాబ్వేతో గురువారం ప్రారంభమైన మ్యాచ్‌లో అయ్యర్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా అయ్యర్‌కు ఇది వరుసగా 8వ టాస్ విజయం కావడం విశేషం. దీంతో ఇప్పటివరకు వరుసగా 7 టాస్‌లు గెలిచి అగ్రస్థానంలో ఉన్న ఎంఎస్ ధోనీ రికార్డును శ్రేయస్ బద్దలు కొట్టాడు.

టాస్ లక్ సూపర్.. కానీ మ్యాచ్ విజయాలేవి?

ఆసక్తికరమైన విషయమేమిటంటే, శ్రేయస్ అయ్యర్ పూర్తిస్థాయి టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు వరుసగా ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ టాస్ గెలుస్తూనే వచ్చాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్‌ల నుంచి మొదలైన ఈ ‘టాస్ మ్యాజిక్’ జింబాబ్వే పోరు వరకు కొనసాగింది. అయితే, టాస్ అదృష్టం ఎంతగా కలిసివస్తున్నా.. మ్యాచ్ ఫలితాల్లో మాత్రం ఆ అదృష్టం కలసిరావడం లేదు. వరుసగా టాస్‌లు గెలిచినా మ్యాచ్‌లను గెలవలేకపోతున్నాడనే విమర్శలు అయ్యర్‌పై బలంగా ఉన్నాయి.

భారత టీ20 కెప్టెన్లలో వరుస టాస్ విజయాల జాబితా:

శ్రేయస్ అయ్యర్: 8 విజయాలు (2026)

ఎంఎస్ ధోనీ: 7 విజయాలు (2010–2012)

విరాట్ కోహ్లీ: 6 విజయాలు (2019)

రోహిత్ శర్మ: 5 విజయాలు (2020–2022)

టాస్ నాణేన్ని తనవైపు తిప్పుకోవడంలో ధోనీ, కోహ్లీ, రోహిత్‌ల కంటే ముందంజలో నిలిచిన శ్రేయస్ అయ్యర్, ఇప్పుడు ఆ అదృష్టాన్ని మ్యాచ్ విజయంగా కూడా మార్చాల్సి ఉంది. జింబాబ్వేపై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్, ఈ మ్యాచ్‌లో గెలిచి అయ్యర్ కెప్టెన్సీలో బోణీ కొడుతుందో లేదో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *