Headlines

బరువు తగ్గేందుకు మందులు వాడుతున్నారా..? బీకేర్‌ఫుల్.. అసలుకే ఎసరు వస్తుంది

బరువు తగ్గేందుకు మందులు వాడుతున్నారా..? బీకేర్‌ఫుల్.. అసలుకే ఎసరు వస్తుంది


బరువు తగ్గేందుకు మందులు వాడుతున్నారా..? బీకేర్‌ఫుల్.. అసలుకే ఎసరు వస్తుంది

బరువు తగ్గాలనే ఆత్రుతలో.. డాక్టర్‌ సలహా లేకుండానే మందులు వాడుతున్నారా..? సోషల్‌ మీడియాలో కనిపించే వీడియోలు, సెలబ్రిటీల ప్రచారం చూసి మౌంజారో, ఓజెంపిక్, వేగోవీ, రైబెల్సస్‌ వంటి మందులు సొంతంగా కొనుగోలు చేస్తున్నారా..? అయితే జాగ్రత్త..! ఇవి సాధారణంగా ఫార్మసీలో దొరికే ‘వెయిట్ లాస్ టాబ్లెట్లు’ కాదు. డాక్టర్ సలహా లేకుండా అత్యుత్సాహానికి పోతే, అంతే అంటూ హెచ్చరిస్తున్నారు వైద్యులు.. ఇవి ప్రమాదకరమని అప్రమత్తంగా ఉండాలంటూ యువతకు సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. బరువు తగ్గించే మెడిసిన్స్ పై డ్రగ్స్ కంట్రోల్‌ అధికారుల దాడులు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మెడికల్‌ షాపుల్లో DCA తనిఖీలు నిర్వహించింది. నిబంధనల ఉల్లంఘనలపై డ్రగ్స్ కంట్రోల్ అధికారుల కొరడా ఝుళిపించారు. 43 మెడికల్‌ షాపుల్లో నిబంధనల ఉల్లంఘనలు గుర్తించి.. ఆయా షాపులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

మౌంజారోలో, ఓజెంపిక్‌, వేగోవీ, రైబెల్సస్‌లో సెమాగ్లూటైడ్ వంటి ఔషధ పదార్థాలు ఉంటాయి. ఇవి ఆకలి, రక్తంలో చక్కెర నియంత్రణతో పాటు కొన్ని సందర్భాల్లో బరువు తగ్గడంలో సహాయపడతాయి. కానీ ఇవి అందరికీ సరిపోయే మందులు కావు. వికారం, వాంతులు, విరేచనాలు, కడుపునొప్పికి సంబంధిత సమస్యలు వంటి దుష్ప్రభావాలు చూపే డేంజర్ డ్రగ్స్. కొన్ని పరిస్థితుల్లో తీవ్రమైన సమస్యలకు కూడా దారితీసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్వయంగా డోస్‌ నిర్ణయించుకోవడం, ఇతరుల ప్రిస్క్రిప్షన్‌తో వాడటం, త్వరగా బరువు తగ్గాలనే ఉద్దేశంతో విచ్చలవిడిగా వినియోగించడం ప్రమాదకరం. అందుకే తెలంగాణ DCA కూడా సెమాగ్లూటైడ్ వంటి ఫార్ములేషన్ల వినియోగంపై ప్రత్యేక ప్రజా అవగాహన చర్యలు చేపట్టింది.

వీటిని మెడికల్‌ షాపులు ఇష్టానుసారం అమ్మకూడదు. ప్రిస్క్రిప్షన్‌ అవసరమైతే నిబంధనలకు అనుగుణంగా మాత్రమే విక్రయించాలి. CDSCO రికార్డుల్లో సెమాగ్లూటైడ్ వంటి GLP-1 ఉత్పత్తులకు ప్రిస్క్రిప్షన్‌కు సంబంధించి రూల్స్ అమల్లో ఉన్నాయి. తెలంగాణ DCA కూడా షెడ్యూల్ H, H1, X వంటి మందులను వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడదని స్పష్టం చేసింది.

అందుకే డాక్టర్‌ సలహా లేకుండా కొనకండి… మీరే డోస్‌ పెంచుకోకండి… ఆన్‌లైన్‌, లేదా అనధికారిక మార్గాల్లో మందులు తెచ్చుకోకండి. బరువు తగ్గడం లక్ష్యమైతే ముందుగా వైద్యుడిని సంప్రదించి, మీ ఆరోగ్య పరిస్థితికి సరిపడే చికిత్సను మాత్రమే తీసుకోవాలి. షార్ట్ కట్‌లో వెయిట్‌ లాస్ అవ్వాలని పరుగులు పెడితే, టోటల్‌గా లాస్ అవుతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

బరువు తగ్గించే GLP-1 ఔషధాల సరఫరా, ప్రచారాలపై ఇటీవలే కేంద్రం కూడా స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దీనిపై రాజ్యసభలో కూడా చర్చ జరిగింది. దీనిపై పర్యవేక్షణ పటిష్ఠం చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చారు. టైప్-2 డయాబెటీస్ చికిత్సకు, ఇతర హెల్త్ ఇష్యూస్ వున్నవారికే GLP-1 ఔషధాల వాడకానికి CDSCO ఆమోదం ఉంది. ఒకవేళ ఎవరికైనా అవసరమైతే డాక్టర్ సలహా లేకుండా వాడొద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *