వర్షాకాలంలో ఏసీ వాడేటప్పుడు సాంకేతికంగా తీసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన జాగ్రత్త మోడ్ ఎంపిక. ఏసీ నడుపుతున్నప్పుడు రిమోట్‌లో కూల్ మోడ్‌కు బదులుగా ఎల్లప్పుడూ డ్రై మోడ్ లేదా డీహ్యూమిడిఫైయర్ మోడ్‌ను ఆన్ చేయాలి. ఈ మోడ్ గదిలోని అదనపు తేమను వేగంగా బయటకు లాగేసి గాలిని పొడిగా చేస్తుంది. తేమ తగ్గడం వల్ల తక్కువ విద్యుత్ వినియోగంతోనే గది చాలా త్వరగా, ఆహ్లాదకరంగా చల్లబడుతుంది.
తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను హనుమకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు ఆందోళనకు గురయ్యారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్న సమయంలోనే ఆయన మృతి చెందినట్లు సమాచారం. ఆయన మరణ వార్తతో బీఆర్ఎస్ శ్రేణుల్లో విషాదం నెలకొంది.
పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. పార్టీ కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ నియోజకవర్గ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు.
ఆయన మృతి విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు తదితర నేతలు హుటాహుటిన వరంగల్ బయల్దేరి వెళ్లారు. పలువురు రాజకీయ ప్రముఖులు పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..