Headlines

బ్యాడ్ లక్ బ్యూటీ..! 5 సినిమాలు చేస్తే ఒకేఒక్క హిట్.. దెబ్బకు కనిపించకుండా పోయింది | Do you know this actress who had four flops out of the five movies she acted in, She is Ketika Sharma

బ్యాడ్ లక్ బ్యూటీ..! 5 సినిమాలు చేస్తే ఒకేఒక్క హిట్.. దెబ్బకు కనిపించకుండా పోయింది | Do you know this actress who had four flops out of the five movies she acted in, She is Ketika Sharma


ఇండస్ట్రీలో లక్కీ హీరోయిన్స్ కొంతమంది ఉంటారు. సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా అవకాశాలు మాత్రం తగ్గకుండా వస్తుంటాయి. అలాగే మరికొందరు భామలు ఉంటారు. అందం అభినయం ఉన్న అవకాశాలు మాత్రం రావు. ఒకవేళ వచ్చిన ఆసినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతుంటాయి. దాంతో సోషల్ మీడియానే నమ్ముకుంటూ ఉంటారు. సినిమాలతో అభిమానులను అలరించలేకపోయినా.. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలతో ఫ్యాన్స్ ను కవ్విస్తూ ఉంటారు. వారిలో పైన కనిపిస్తున్న ముద్దుగుమ్మ ఒకరు. తన అందాలతో కుర్రకారుకు మత్తెక్కించింది ఆ ముద్దుగుమ్మ కానీ సినిమాలు మాత్రం ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు ఒకే ఒక్క సినిమా హిట్ అయ్యింది. అయినా కూడా దర్శకనిర్మాతలు పెద్దగా పట్టించుకోవడం లేదు. చేసిన సినిమాలన్నీ నిరాశపరిచినా.. ఆమె క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

ఇది కూడా చదివేసేయండి :ఈ పిచ్చి డ్రెస్సులు ఏంటి..? పిచ్చి పాటలు ఏంటి.? అనుకున్నా.. కానీ కృష్ణగారి దెబ్బకు ఆ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది

ఆమె మరెవరో కాదు టాలీవుడ్ హాట్ బ్యూటీ కేతిక శర్మ. ఈ అందాల భామకు హిట్స్ కంటే ఫ్లాపులే ఎక్కువ..  2021లో విడుదలైన రొమాంటిక్‌ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యిందిఈ అమ్మడు. ఆకాష్ పూరి హీరోగా వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత నాగశౌర్య లక్ష్య అనే సినిమా చేసింది.. కానీ ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. వైష్ణవ్ తేజ్ తో రంగ రంగ వైభవంగా, అలాగే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన బ్రో సినిమాలో చేసింది. ఈ సినిమాలేవీ అంతగా హిట్ అవ్వలేదు.

ఇవి కూడా చదవండి



ఇది కూడా చదివేసేయండి :Anil Ravipudi: ఇండస్ట్రీలో వాడు నా బెస్ట్ ఫ్రెండ్.. అయినా కూడా నా సినిమాల్లో అతను నటించలేదు

ఆతర్వాత ఎట్టకేలకు ఒక్క హిట్ అందుకుంది. అది సింగిల్ అనే సినిమాతో.. శ్రీవిష్ణు హీరోగా నటించిన సింగిల్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో కేతిక అకౌంట్ లో మొదటి హిట్ పడింది. ఈ సినిమాలో కేతిక తన నటనతో ఆకట్టుకుంది. అయినా కూడా ఈ ముద్దుగుమ్మ సినిమా ఆఫర్స్ అంతగా రాలేదు. ప్పుడు ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం కేతిక చేతిలో సినిమాలు ఏవి లేవు. కానీ సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. రెగ్యులర్ గా క్రేజీ ఫోటోలు, హాట్ హాట్ పిక్స్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక తన అందాలతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది ఈ ముద్దుగుమ్మ. కేతిక క్రేజీ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

ఇది కూడా చదివేసేయండి : మహేష్ బాబుకు మాత్రమే నేను విలన్‌గా నటిస్తా.. మనసులో మాట బయటపెట్టిన హీరో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *