పరమాన్నం వండటానికి కావాల్సిన ఆహార పదార్థాలు : క్రీమీ మిల్క్ పాలు లీటర్, బెల్లం కప్పు, బియ్యం మూడు కప్పులు, నెయ్యి నాలుగు టేబుల్ స్పూన్స్, జీడిపప్పు పది నుంచి 12, కిస్మిస్ పది నుంచి పన్నెండు, యాలకుల పొడి, జాజికాయ పొడి, పచ్చ కర్పూరం కొంచెం. టెంపుల్ స్టైల్ ఫ్లేవర్ కోసం.
తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా మూడు కప్పుల బియ్యం తీసుకొని శుభ్రంగా కడగాలి. తర్వాత వాటిని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బైల్ తీసుకొని అందులో నానబెట్టిన బియ్యం వేసి మంచిగా ఉడికించుకోవాలి. మరీ మెత్తగా మరీ గట్టిగా కాకుండా నార్మల్గా ఉడకబెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, అందులో నాలుగు టీస్పూన్ల నెయ్యి వేసి, కిస్మిస్, జీడిపప్పులు అన్నీ వేసి మంచిగా వేయించుకోవాలి. బంగారు రంగు వచ్చే వరకు వేయించుకున్న తర్వాత వీటిని పక్క న పెట్టుకోవాలి.
ఇప్పుడు మరో వైపు స్టవ్ పై పాన్ పెట్టి అందులో పాలు పోసి మంచిగా మరిగబెట్టుకోవాలి. పాలు ఎంత బాగా మరిగితే రుచి అంత బాగా ఉంటుంది. ఇప్పుడు ఈ మరిగిన పాలను ఉడికే అన్నంలో వేసి మంచిగా కలుపుకోవాలి. పాలు దగ్గరకు వచ్చి అన్నం ఉడికే వరకు కలుపుతూనే ఉండాలి.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, కాస్త వేడి తగ్గిన తర్వాత అందులో బెల్లం వేసి మంచిగా కలుపుకోవాలి. బెల్లం వేసి అన్నం బాగా ఉడికిన తర్వాత, ఇప్పుడు కిస్మిస్, నెయ్యి, యాలకుల పొడి, జీడిపప్పులు అన్నీ కూడా ఇందులో వేయాలి. అలాగే పటిక కూడా వేసి బాగా కలుపుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ పరమాన్నం రెడీ.




