Headlines

మృగాన్నే అయినా.. నేనూ అమ్మనే.. కొంచెం ఆగండి! | Mother Tiger Melts Hearts as She Safely Escorts Cubs Across Road in Tadoba video tv9d – Viral Videos in Telugu

మృగాన్నే అయినా.. నేనూ అమ్మనే.. కొంచెం ఆగండి! | Mother Tiger Melts Hearts as She Safely Escorts Cubs Across Road in Tadoba video tv9d – Viral Videos in Telugu


అమ్మ అంటే పిల్లలకు ఒక భరోసా..అమ్మను మించిన పెద్ద రక్షణ మరొకటి ఉండదు. అది క్రూరమృగమైనా..మానవులైనా మాతృప్రేమలో తేడా ఉండదు. అందుకు మరో ఉదాహరణే ఈ ఘటన. ఎక్కడో దూరం నుంచి పులి గాండ్రింపు వినిపిస్తే ఇక్కడ గుండెజారిపోతుంది. అలాంటి బెబ్బులి ఎంతో ప్రశాంతంగా తన పసికూనలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ రోడ్డుదాటుతున్న దృశ్యాలు చూపరులను కట్టిపడేశాయి. ఈ అరుదైన దృశ్యం మహారాష్ట్రలోని చంద్రపూర్‌ జిల్లాలో జరిగింది. తడోబా అభయారణ్యం సమీపంలో మోహర్లీ ప్రధాన రహదారిపై ఒక తల్లి పులి తన పసికూనలతో కలిసి స్వేచ్ఛగా విహరిస్తూ కనువిందు చేసింది. తన బుజ్జి పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటూ, రహదారిపై హుందాగా అడుగులు వేస్తున్న ఆ బెబ్బులి మాతృప్రేమ దృశ్యాలు అక్కడున్న వారిని అబ్బురపరిచాయి. రోడ్డు మీద వాహనాలు దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో మొదట తల్లి పులి రోడ్డు మీదకు వచ్చింది. వాహనదారులను కాసేపు ఆగమన్నట్టుగా రోడ్డుపై ఓ రౌండ్‌ వేసింది. రోడ్డుపై బెబ్బులిని చూడగానే వాహనదారులు ఎక్కడివారక్కడే నిలిచిపోయారు. అనంతరం తన పిల్లలను పిలుస్తున్నట్టుగా గాండ్రించింది. వెంటనే పక్కనే ఉన్న పొదల్లోంచి రెండు పులికూనలు చిట్టి పొట్టి అడుగులతో అమ్మదగ్గరకు పరుగెత్తుకొచ్చాయి. ఆ కూనలను జాగ్రత్తగా కాపాడుకుంటూ పులి రోడ్డుదాటి వెళ్లిపోయింది. ఈ అరుదైన దృశ్యాన్ని ఆ మార్గంలో వెళ్తున్న ఓ ప్రయాణికుడు తన కెమెరాలో బంధించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. క్రూరమైన బెబ్బులిలోనూ దాగి ఉన్న అపారమైన మాతృప్రేమను, ప్రకృతి అందించిన ఈ రమణీయ దృశ్యాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తడోబా టైగర్ రిజర్వ్‌లో వర్షాకాలం సందర్భంగా మూడు నెలల పాటు పర్యాటకుల సందర్శనను నిలిపివేశారు. మనుషుల సంచారం తగ్గడంతో అడవిలోని మూగజీవాలకు పూర్తి స్వేచ్ఛ లభించింది. ఈ క్రమంలోనే దట్టమైన అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన ఈ రాజసం ఉట్టిపడే క్రూర మృగం, ఎలాంటి భయం లేకుండా తన పిల్లలకు ప్రకృతి ఒడిలో పాఠాలు నేర్పుతున్నట్లుగా రహదారిపై సాగిపోయింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మన కరెన్సీపై పదేళ్ల ఆంక్షలకు తెర.. రూ.500 నోట్లకు నేపాల్ గ్రీన్ సిగ్నల్

ఇల్లు కొనడానికి పీఎఫ్ డబ్బులు తీస్తున్నారా? ఈ వార్త మీకోసమే!

ఓరి మీ కక్కుర్తి కూలా.. ఇదేం పనిరా సామీ!

ఇకపై నన్ను అలా పిలవొద్దు.. పవన్ అర్ధాంగి ఎమోషనల్ పోస్ట్

గుడ్‌న్యూస్.. బుక్ చేసిన 4 గంటల్లోనే ఎల్పీజీ సిలిండర్ డెలివరీ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *