Headlines

వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి.. లేదంటే తిప్పలు తప్పవు! | Why You Should Be Careful Consuming Leafy Greens During the Rainy Season

వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి.. లేదంటే తిప్పలు తప్పవు! | Why You Should Be Careful Consuming Leafy Greens During the Rainy Season


వర్షాకాలంలో మనం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ సీజన్‌లో మన శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గడంతో పాటు.. జీర్ణశక్తి కూడా మందగిస్తుంది. అందువల్ల ఈ సమయంలో తినే ఆహారం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఆకు కూరలు మన ఆరోగ్యాన్ని చాలా ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ ఈ సీజన్‌లో కొన్ని ఆకు కూరలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాటిని ఎందుకు తీసుకోకూడదో, వాటి వెనుక ఉన్న కారణాలు ఇప్పుడు చూద్దాం.

వర్షాకాలంలో ఈ ఆకుకూరలు తినే ముందు జాగ్రత్త

మునగాకు: వర్షాకాలంలో మునగ చెట్టు వాతావరణం, నేల నుంచి అధిక తేమను పీల్చుకోవడం వల్ల దానికి ఉండే ఆకులు చేదుగా మారతాయని అంటారు. ఈ సమయంలో మునగాకులో బాక్టీరియా, పురుగులు చేరే అవకాశం ఉందని.. అంతేకాకుండా అది జీర్ణం అవ్వడానికి కూడా టైం తీసుకుందని చెబుతున్నారు. కాబట్టి వర్షాకాలంలో వీటిని మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

చామకూర: సాధారణంగా చామకూరలో దురదను కలిగించే కాల్షియం ఆక్సలేట్ స్పటికాలు ఉంటాయి. వర్షాకాలంలో వీటి పరిమాణం పెరుగుతుంది. కాబట్టి దీనిని సరిగ్గా ఉడికించకుండా తింటే గొంతులో మంట, దురద, కడుపులో అలర్జీ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. జీర్ణశక్తి తక్కువగా ఉండే ఈ సమయంలో చామకూర త్వరగా అరగతి ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

తోటకూర, పాలకూర: వర్షాకాలంలో తోటకూర లేదా ఇతర సాధారణ ఆకుకూరల ఆకులు, కాడల్లో తేమ నిలిచిపోవడం వల్ల పురుగులు, క్రిములు గుడ్లు పెట్టే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని.. వీటిలో ఉండే కొన్ని మూలకాలు జీర్ణవ్యవస్థను దెబ్బతీసి గ్యాస్ ప్రాబ్లమ్, కడుపునొప్పి వంటి సమస్యలను కలిగిస్తాయి అందువల్ల వర్షాకాలంలో వీటిని తినేప్పుడు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఆకుకూరలు తినేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వర్షాకాలంలో ఆకుకూరలను వండే ముందు ఉప్పు, పసుపు వేసిన గోరువెచ్చని నీటిలో కాసేపు నానబెట్టి, ఆ తర్వాత బాగా కడగాలి.అలాగే ఆకుకూరలను సగం ఉడికించి తినకూడదు. పూర్తిగా, బాగా ఉడికించిన తర్వాత మాత్రమే ఆహారంలో తీసుకోవాలి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *