Headlines

విదేశాల్లో వర్క్‌ చేయాలనుకునేవారికి గుడ్‌ న్యూస్‌! | Top Countries Offering Easy Work Visas for Skilled Indian Professionals video tv9d – World Videos in Telugu

విదేశాల్లో వర్క్‌ చేయాలనుకునేవారికి గుడ్‌ న్యూస్‌! | Top Countries Offering Easy Work Visas for Skilled Indian Professionals video tv9d – World Videos in Telugu


మెరుగైన జీతం, ప్రపంచ స్థాయి జీవనశైలి, కెరీర్‌లో వేగవంతమైన ఎదుగుదల కోరుకుంటూ వేలాది మంది భారతీయులు విదేశీ ఉద్యోగాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే సరైన ఉద్యోగం లభించినప్పటికీ, కఠినమైన వీసా నిబంధనలు వారికి పెద్ద సవాలుగా మారుతుంటాయి. అలాంటి నిపుణుల కోసం సులభమైన వర్క్ వీసా విధానాలతో అవకాశాలు కల్పిస్తున్నాయి కొన్ని దేశాలు. అవేంటో ఇక్కడ చూద్దాం. భారతీయ నిపుణులకు జర్మనీ అత్యంత అనుకూల దేశం. ఆఫర్ లెటర్ ఉంటే వర్క్ వీసా సులభంగా వస్తుంది. ఉద్యోగం లేని వారికి కూడా ‘ఆపర్చునిటీ కార్డ్’ ద్వారా అక్కడకి వెళ్లే వెసులుబాటు ఉంది. వీసా కేవలం 15 రోజుల్లోనే ప్రాసెస్ అవుతుంది. జర్మనీకి వెళ్లి అక్కడ 1 సంవత్సరం పాటు ఉద్యోగం వెతుక్కునేందుకు ఈ వీసా అనుమతిస్తుంది. ఆస్ట్రేలియాలో విద్యార్హతలు, అనుభవం, ఇంగ్లీష్ ప్రావీణ్యం ఆధారంగా పాయింట్ల విధానంలో వీసాలు మంజూరు చేస్తారు. స్కిల్డ్ ఇండిపెండెంట్, ఎంప్లాయర్ నామినేషన్ వంటి అనేక రకాల వీసాలు అందుబాటులో ఉన్నాయి. వీసా రకాన్ని బట్టి ప్రాసెసింగ్‌కు కొన్ని నెలల నుంచి ఏడాది వరకు పట్టే అవకాశం ఉంది. న్యూజిలాండ్‌లో గుర్తింపు పొందిన యజమాని నుంచి జాబ్ ఆఫర్ ఉంటే ఆన్‌లైన్‌లోనే సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండి మంచి నడవడికతో పాటు ఇతర అవసరమైన అర్హతలు తప్పనిసరి. ‘అక్రెడిటెడ్ ఎంప్లాయర్ వర్క్ వీసా’ దాదాపు 20 నుంచి 44 రోజుల్లో జారీ అవుతుంది. యూఏఈ వీసా ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. ఉద్యోగం ఇచ్చే సంస్థే దరఖాస్తు ప్రక్రియను ప్రారంభిస్తుంది. గతంలో 15 దశల్లో ఉండే ఈ ప్రక్రియను ఐదు దశలకు కుదించారు. కేవలం ఐదు పని దినాల్లోనే వీసా చేతికి వస్తుంది. టెక్నాలజీ, ఫైనాన్స్, ఇంజినీరింగ్ రంగాల వారికి నెదర్లాండ్స్‌ ఆదర్శవంతమైన దేశం. ఉద్యోగ అవకాశంతో పాటు నిర్ణయించిన కనీస వేతన ప్రమాణాలు ఉండాలి. హైలీ స్కిల్డ్ మైగ్రెంట్, ఈయూ బ్లూ కార్డ్ వంటి వీసాలు ఎక్కువగా వినియోగంలో ఉన్నాయి. 2 నుంచి 5 వారాల్లో వీసా పొందే అవకాశం ఉంది. ఆసియాలో ఉద్యోగాలకు కేంద్రంగా సింగపూర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఫైనాన్స్‌, ఐటీ, మేనేజ్‌మెంట్‌ రంగాల నిపుణులకు ఇక్కడ డిమాండ్‌ ఎక్కువ. ఎంప్లాయ్‌మెంట్‌ పాస్‌, ఎస్‌ పాస్‌ వంటి వీసాలకు ఎక్కువ మంది దరఖాస్తు చేస్తుంటారు. జాబ్‌ ఆఫర్‌ వచ్చిన తర్వాత యజమానే ఆన్‌లైన్‌లో వీసా ప్రక్రియను పూర్తి చేస్తారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లేడీ ఏసీపీ సాహసం… కదులుతున్న బస్సుకు ఎదురుగా నిలబడి

ఆహా స్కెచ్‌ అంటే నీదే బాస్‌.. అప్పు తీర్చడానికి ఏం ప్లాన్‌ చేసాడు..!

రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ కొత్త రూల్స్‌ తెలుసుకోకపోతే నష్టమే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *