Headlines

విద్యార్ధులకు అలర్ట్.. తెలంగాణ SET 2026 నోటిఫికేషన్ వచ్చేసింది! రాత పరీక్ష ఎప్పుడంటే.. | Telangana SET 2026 Notification Released: Online Applications Begin from August 3

విద్యార్ధులకు అలర్ట్.. తెలంగాణ SET 2026 నోటిఫికేషన్ వచ్చేసింది! రాత పరీక్ష ఎప్పుడంటే.. | Telangana SET 2026 Notification Released: Online Applications Begin from August 3


తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (Telangana State Eligibility Test) 2026 నోటిఫికేషన్‌ను ఉస్మానియా యూనివర్సిటీ తాజాగా విడుదల చేసింది. షెడ్యూల్‌ ప్రకారం సెట్ పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ చివరి వారంలో జరగనుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆగస్ట్‌ 3, 2026వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని అసిస్టెంట్‌ ప్రొఫెసర్, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ నియామకాలకు అర్హత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీజీ సెట్‌ పరీక్షను యేటా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ఓయూ ఆధ్వర్యంలో సెట్‌ పరీక్ష నిర్వహించనుంది.

సెట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు కనీసం 55 శాతం మార్కులతో సంబంధి సబ్జెక్టులో ఎంఏ, ఎంస్సీ, ఎంకాం, ఎంబీఏ, ఎంఎల్‌ఐఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంసీజే, ఎల్‌ఎల్‌ఎం, ఎంసీఏ, ఎంటెక్‌ వంటి మాస్టర్‌ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. పీజీ ఆఖరు సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్ధులు ఆగస్టు 30, 2026వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.3 వేల ఆలస్య రుసుముతో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్‌ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబరు 13 నుంచి వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

తెలంగాణ సెట్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పరీక్ష విధానం

సెట్ పరీక్ష మొత్తం రెండు పేపర్లలతో మూడు గంటల వ్యవధితో ఆన్‌లైన్‌ విధానంలో ఉంటుంది. పేపర్‌ 1లో 50 ప్రశ్నలు 100 మార్కులకు, రెండో పేపర్‌ 100 ప్రశ్నలు 200 మార్కులకు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: ఆగస్ట్ 3, 2026.
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్ట్‌ 30, 2026.
  • రూ.1500 ఆలస్య రుసుముతో రిజిస్ట్రేషన్‌ చివరి తేదీ: ఆగస్ట్‌ 31 నుంచి సెప్టెంబర్ 5 వరకు
  • రూ.2000 ఆలస్య రుసుముతో రిజిస్ట్రేషన్‌ చివరి తేదీ: సెప్టెంబర్ 6 నుంచి 10 వరకు
  • రూ.3000 ఆలస్య రుసుముతో రిజిస్ట్రేషన్‌ చివరి తేదీ: సెప్టెంబర్ 11 నుంచి 12 వరకు
  • దరఖాస్తులో మార్పులకు అవకాశం: సెప్టెంబర్ 13 నుంచి 15 వరకు
  • హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: సెప్టెంబర్ 22 నుంచి
  • సెట్‌ పరీక్ష తేదీలు: సెప్టెంబరు చివరి వారంలో

తెలంగాణ సెట్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *