1. తీవ్ర జ్వరం, ఇన్ఫెక్షన్లు లేదా సర్జరీలు: టైఫాయిడ్, డెంగ్యూ, కోవిడ్ లేదా ఇతర ఇన్ఫెక్షన్లు/చిన్నపాటి సర్జరీలు జరిగిన 2 నుండి 3 నెలల తర్వాత తీవ్రంగా జుట్టు రాలడం మొదలవుతుంది. దీనిని 'టెలోజెన్ ఎఫ్లూవియం' అంటారు. శరీరానికి ఒత్తిడి తగ్గిన తర్వాత సరైన చికిత్సతో ఇది క్రమంగా తగ్గుతుంది.
2. ఐరన్ మరియు ఫెర్రిటిన్ లోపం: ముఖ్యంగా భారతీయ మహిళల్లో శరీరంలో ఐరన్ చాలా తక్కువగా ఉంటుంది. రక్తహీనత, నెలసరి సమస్యల వల్ల ఫెర్రిటిన్ తగ్గినప్పుడు హెయిర్ ఫాలికల్స్ బలహీనపడి జుట్టు రాలుతుంది.
3. విటమిన్-డి మరియు విటమిన్-బి12 లోపాలు: ఈ ముఖ్యమైన విటమిన్ల లోపం వల్ల వెంట్రుకల కుదుళ్లకు సరైన పోషణ అందక హెయిర్ ఫాల్ తీవ్రమవుతుంది. 4. థైరాయిడ్ సమస్యలు: హైపో లేదా హైపర్ థైరాయిడిజం ఉన్నప్పుడు ప్రారంభంలో అలసట, బరువు పెరగడం/తగ్గడం వంటి లక్షణాలతో పాటు జుట్టు వేగంగా రాలిపోతుంది.
5. పీసీఓఎస్ / పీసీఓడీ (PCOS): హార్మోన్ల అసమతుల్యత వల్ల తలమీద జుట్టు పలుచబడటం, అదే సమయంలో గడ్డం, ముఖంపై అవాంఛిత రోమాలు రావడం జరుగుతుంది. 6. ప్రసవానంతరం జుట్టు రాలడం: డెలివరీ అయిన 3 నుండి 8 నెలల కాలంలో హార్మోన్ల మార్పులు, నిద్రలేమి, పోషకాహార లోపం వల్ల జుట్టు ఎక్కువగా రాలుతుంది.
7. క్రాష్ డైట్స్ & వేగంగా బరువు తగ్గడం: సరైన న్యూట్రిషనిస్ట్ సలహా లేకుండా హఠాత్తుగా కఠినమైన డైటింగ్ చేయడం వల్ల శరీరానికి ప్రొటీన్లు, మైక్రోన్యూట్రియెంట్లు అందక తీవ్రమైన హెయిర్ ఫాల్ వస్తుంది. 8,9 జన్యుపరమైన కారణాలు& ఒత్తిడి: కుటుంబంలో బట్టతల లేదా హెయిర్ థిన్నింగ్ చరిత్ర ఉండటం, తీవ్ర మానసిక ఒత్తిడి జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
10. రోజువారీ అనారోగ్యకర అలవాట్లు: నిద్రలేమి, జంక్ ఫుడ్ తినడం, సరైన జీవనశైలి లేకపోవడం వల్ల జుట్టు బలహీనపడుతుంది. జుట్టు రాలడం వారాల తరబడి కొనసాగితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించి రక్తపరీక్షలు చేయించుకోవాలి. సకాలంలో సరైన చికిత్స తీసుకోకపోతే జుట్టు శాశ్వతంగా నష్టపోయే ప్రమాదం ఉంది!





