Headlines

Jabardasth: ఈ అక్కాచెల్లెళ్లలో ఒకరు జబర్దస్త్‌ స్టార్ కమెడియన్.. ఎవరో గుర్తు పట్టారా? ఇప్పుడు సినిమాల్లోనూ..


Jabardasth: ఈ అక్కాచెల్లెళ్లలో ఒకరు జబర్దస్త్‌ స్టార్ కమెడియన్.. ఎవరో గుర్తు పట్టారా? ఇప్పుడు సినిమాల్లోనూ..

పై ఫొటోలో ఉన్న అక్కాచెల్లెళ్లను గమనించారా? అందులో ఒకామె ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా ఫేమస్. కమెడియన్ గా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంటోంది. అంతకు ముందు జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి పలు టీవీ షోల్లోనూ మెరిసిందీ అందాల తార. తన నటనతో అతి తక్కువ కాలంలోనే స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అన్నట్లు ఈ ముద్దుగుమ్మ తల్లి కూడా ఫేమస్ నటినే. పెదరాయుడు వంటి సినిమాల్లోనూ నటించారు. ఇక ఇటీవల నటి సోదరి కూడా వార్తల్లో నిలిచింది. విజయవంతమైన విక్రమ్-1 రాకెట్ ప్రయోగంలో పాలు పంచుకుంది. దీంతో ఈ ఇద్దరి అక్కాచెల్లెళ్లు బాగా ఫేమస్ అయ్యారు. మరి వారెవరో గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే సమాధానం మేమే చెబుతాం లెండి.. పై ఫొటోలో ఉన్నది మరెవరో కాదు జబర్దస్త్ ఫేమ్ సత్యశ్రీ, ఆమె సోదరి కీర్తి శ్రీ. బుధవారం (సెప్టెంబర్ 02)న కీర్తి శ్రీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన చెల్లెలికి బర్త్ డే విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది సత్యశ్రీ. చిన్నప్పటి నుంచి వివిధ సందర్భాల్లో తన సోదరితో కలిసి దిగిన ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది.

‘ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది నీ జీవితంలో ఒక అందమైన కొత్త అధ్యాయానికి నాంది పలికింది. Skyroot ఇంజనీర్‌ గా నీ ప్రయాణం, నీ కృషి అలాగే Vikram-1 ప్రయోగం సాధించిన అద్భుత విజయం… ఇవన్నీ నీ కోసం వేచి ఉన్న గొప్ప విషయాలకు కేవలం ఆరంభం మాత్రమే. నువ్వు ఎదిగిన తీరు, నువ్వు సాధించిన విజయాల పట్ల నాకు ఎంతో గర్వంగా ఉంది. ఈ సంవత్సరం నీ జీవితంలో ఒక నిజమైన మలుపుగా మారి, గొప్ప కలలు, అద్భుత విజయాలు, లెక్కలేనన్ని అందమైన క్షణాలకు మార్గం సుగమం చేయాలని కోరుకుంటున్నాను. జీవితం నిన్ను ఎంత దూరం తీసుకెళ్లినా, ఒక్క విషయం ఎప్పుడూ గుర్తుంచుకో .. ‘నీ కోసం నీ అక్క ఎప్పుడూ ఉంటుంది. ప్రతి విజయంలో, ప్రతి వైఫల్యంలో, ప్రతి సరదా క్షణంలో, నీ జీవితంలోని ప్రతి దశలోనూ నేను నీకు తోడుగా ఉంటాను. ఎల్లప్పుడూ నీ పక్కనే ఉంటాను. మాటల్లో చెప్పలేనంతగా నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు ఎప్పుడూ కలలు కన్నట్లుగానే, నీ కలలు ఆకాశంలోని నక్షత్రాలను తాకాలని ఆశిస్తున్నాను. హ్యాపీ బర్త్ డే మై సిస్టర్’ అంటూ తన చెల్లిపై తనకున్న ప్రేమకు అక్షర రూపమిచ్చింది సత్యశ్రీ.

జబర్దస్త్ సత్యశ్రీ ఎమోషనల్ పోస్ట్..

 

View this post on Instagram

 

A post shared by Satya Sri (@me_satyasri)

జబర్దస్త్ నటి షేర్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కీర్తి శ్రీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

విక్రమ్- రాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్య శ్రీ చెల్లెలు..

 

View this post on Instagram

 

A post shared by Satya Sri (@me_satyasri)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *