Headlines

వీళ్లు తలతో కొడితే కొబ్బరికాయైనా పగలాల్సిందే | Meet the Madiga Mastins: Andhra’s Forgotten Daredevil Artists Fighting to Keep a Rare Tradition Alive video t9d – Viral Videos in Telugu

వీళ్లు తలతో కొడితే కొబ్బరికాయైనా పగలాల్సిందే | Meet the Madiga Mastins: Andhra’s Forgotten Daredevil Artists Fighting to Keep a Rare Tradition Alive video t9d – Viral Videos in Telugu


వారు ఎప్పుడూ జిమ్‌కి వెళ్లిందీ లేదు.. ప్రొటీన్ల కోసం ప్రత్యేకమైన ఆహారం తిన్నదీ లేదు. కానీ, 100 కేజీల రాయిని గాల్లోకి ఎగరవేసి భుజంతో క్యాచ్ పడతారు! బలిసిన గొర్రెపోతుతో తలతో డీ కొడతారు. ఇలా వీరి సాహస విన్యాసాలు చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అసలు ఇంతకీ ఎవరీ వీరులు? గాల్లోకి కొబ్బరికాయను ఎగరవేసి తలతో ముక్కలు చేయడమంటే సామాన్యమైన విషయమా? అంతేకాదు 20 కేజీలు, 40 కేజీలు, చివరికి 60 కేజీల రాళ్లను గాల్లోకి ఎగరవేసి వీపు అడ్డం పెడతారు. సాధారణంగా ఇలా చేస్తే వెన్నుపూస లేదా భుజంగూడు జారిపోవడం ఖాయం. కానీ ఎలాంటి భయం, బెరుకు లేకుండా తమ శరీరాలతో అద్భుతమైన సాహస కళను ప్రదర్శిస్తున్నారు ‘మాదిగ మాస్టీన్లు’. ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా వేళ్లతో లెక్కపెట్టగలిగే సంఖ్యలోనే వీరు ఉన్నారు. పూర్వం విజయనగరం రాజుల పాలనలో యుద్ధవీరులుగా జీవించి గౌరవ మర్యాదలు పొందిన వీరు, తదనంతరం రాజ్యాలు అంతరించడంతో తమ బాహుబలాన్ని, శక్తిని నమ్ముకుని ప్రదర్శనలిస్తూ జీవిస్తున్నారు. వీరు ఎంతటి ధైర్యసాహసాలు ప్రదర్శించినా, వీరి నిజ జీవితాలు మాత్రం చాలా కష్టంగా సాగుతున్నాయి. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వీరిని ‘మాస్టీన్లు’ అని పిలుస్తారు. అయితే తమకు కనీసం కుల ధ్రువీకరణ పత్రాలు సైతం మంజూరు కావటం లేదని ఈ కళాకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్వం సంచార జీవులుగా ఊరూరూ తిరుగుతూ తమ ప్రదర్శనలతో ప్రజల ఆదరణ పొంది, వారు ఇచ్చే దాంతో జీవనం సాగించేవారు. అయితే ఇప్పుడు ఒకే గ్రామంలో స్థిరపడి ఉంటున్నా, తమను కనీసం గుర్తింపు పొందిన ‘కళాకారులు’గా కూడా ప్రభుత్వం పరిగణించడం లేదని వారు వాపోతున్నారు. ఇటీవల మాస్టీన్ కళాకారుల విన్యాసాలను ప్రత్యక్షంగా చూసిన ప్రభుత్వ విప్, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చలించిపోయారు. అంతరించిపోతున్న ఈ అరుదైన సాహస కళను, కళాకారులను ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వీరి నైపుణ్యాన్ని, సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Health Benefits of Punarnava: ఈ ఆకు పచ్చడి చేసుకుని తింటే.. మోకాళ్ల నొప్పులు పరార్‌

ఆ ఊరే.. ఓ రంగస్థలం.. అక్కడ అందరూ పాత్రధారులే..!

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు డిస్కో లైట్ల బెడద.. ల్యాండింగ్ వేళ ముప్పుగా మారిన లేజర్‌ లైట్లు

ప్రాణాలు తీస్తున్న లిఫ్ట్‌ ప్రమాదాలు.. రెండు రోజుల్లో ఇద్దరు మృతి

ఏ ఊరి పులి రా ఇది! డ్రోన్లకే షాకిస్తోంది..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *