Headlines

సారూ.. మా ఊరికి బస్సెయ్యరూ..! ఆరేళ్ల చిన్నారి విజ్ఞప్తి | Please Start a Bus to Our Village 6 Year Old Boy’s Plea Wins Minister’s Heart video

సారూ.. మా ఊరికి బస్సెయ్యరూ..! ఆరేళ్ల చిన్నారి విజ్ఞప్తి | Please Start a Bus to Our Village 6 Year Old Boy’s Plea Wins Minister’s Heart video


“మా ఊరికి బస్సు వేయించండి మంత్రి గారు” అంటూ ఓ ఆరేళ్ల బాలుడు చేసిన విన్నపం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఖమ్మం జిల్లా కల్లూరులో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కల్లూరు మండలం చెన్నూరు నుండి లింగాల మధ్యలో ఉన్న ఎర్రబోయినపల్లి గ్రామం ప్రధాన రహదారికి రెండు కిలోమీటర్ల లోపల ఉంటుంది. సరైన రవాణా సదుపాయం లేకపోవడంతో ఆటో డ్రైవర్లు ఒక్కొక్కరి నుంచి రూ.50 వరకు వసూలు చేస్తున్నారు. దీంతో బడికి వెళ్లే పిల్లలు, గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఎర్రబోయినపల్లి గ్రామానికి RTC బస్సు సర్వీసు పునరుద్ధరించాలని ఆ చిన్నారి తన తండ్రితో కలిసి వచ్చి రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందించాడు. ఆ బుడ్డోడి సమయస్ఫూర్తికి, అమాయకత్వానికి మంత్రి పొంగులేటి మురిసిపోయారు. వెంటనే స్పందించిన ఆయన, స్థానిక RTC అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఎర్రబోయినపల్లి మీదుగా బస్సు నడిపించాలని ఆదేశిస్తూ.. “వారం రోజుల్లో మీ ఊరికి బస్సు వస్తుంది చిన్నా!” అని ఆప్యాయంగా హామీ ఇచ్చారు. దీంతో త్వరలోనే తమ రవాణా కష్టాలు తీరబోతున్నాయని, ఆ చిన్నారిని ఊరి ప్రజలంతా ‘శభాష్ రా బుడ్డోడా’ అంటూ కొనియాడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విస్తరిస్తున్న ఉపరితల ఆవర్తనం వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు ఆ జిల్లాలకు IMD రెడ్ అలర్ట్

కనలేక కొనేస్తున్న దంపతులు.. అడ్డగోలుగా అమ్మేస్తున్న దళారులు

పిల్లల ప్రాణాలు తీస్తున్న అరుదైన వైరస్.. హైఅలర్ట్ ప్రకటించిన సర్కార్‌!

పైకి.. కిట్‌ కాట్‌ చాక్లెట్ ప్యాకెట్‌.. ఓపెన్‌ చేస్తే కళ్లు జిగేల్‌!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *