Headlines

సినిమా ఇండస్ట్రీకి కీలక సూచనలతో థియేటర్లు, టికెట్ రేట్లపై తెలంగాణ సర్కార్ జీవో | Telangana Issues New GO on Cinema Theatres and Ticket Prices video – Entertainment Videos in Telugu


తెలంగాణలో సినిమా ఇండస్ట్రీకి కీలక సూచనలతో థియేటర్లు, టికెట్ రేట్లపై జీవో జారీ చేసింది ప్రభుత్వం. సామాన్యులకు భారం కలగకుండా ఉండేలా నిర్ణయాలు తీసుకుంటూనే.. బిగ్ బడ్జెట్ మూవీస్, థియేటర్ ఓనర్లకు ఊరటనిచ్చేలా కొత్త రూల్స్ తీసుకొచ్చింది. 5 షోల అనుమతి నుంచి 100 కోట్ల సినిమాల టికెట్ రేట్ల పెంపు వరకు ఈ సరికొత్త జీవోలో ఉన్న ఆసక్తికరమైన మెయిన్ పాయింట్స్ ఏంటో చూద్దామా..? టికెట్ రేట్లు, సినిమా థియేటర్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక జీవో విడుదల చేసింది. 7.1 సౌండ్, 2K లేదా 4K ప్రొజెక్షన్, 75 అడుగుల కంటే పెద్ద స్క్రీన్ ఉన్న సింగిల్ స్క్రీన్స్‌ను ఇకపై స్పెషల్ థియేటర్లుగా గుర్తించనుంది ప్రభుత్వం. Non-AC థియేటర్లలో టికెట్ ధరలు కనిష్ఠంగా ₹30–₹50, గరిష్ఠంగా ₹70–₹100.. AC థియేటర్లలో కనిష్ఠంగా ₹50–₹100, గరిష్ఠంగా ₹150–₹200 రూపాయిలుగా నిర్ణయించింది. స్పెషల్ థియేటర్స్‌లో టికెట్ ధరలు ₹100 నుంచి ₹300 రూపాయిలుగా, మల్టీప్లెక్స్‌లలో రెగ్యులర్ ₹100 నుంచి ₹250, రిక్లైనర్ రేట్ ₹200–₹300 రూపాయలుగా నిర్ణయించింది ప్రభుత్వం. సామాన్య, మధ్యతరగతి ప్రేక్షకులకి భారం కాకుండా మల్టీప్లెక్స్‌తో సహా ప్రతి థియేటర్లో కచ్చితంగా 25 శాతం సీట్లను తక్కువ రేటుండే నాన్-ప్రీమియం కేటగిరీ కింద ఉంచాలని స్పష్టం చేసింది. ఉదయం 8 నుంచి రాత్రి ఒంటి గంట వరకు రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేలా థియేటర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే.. పెద్ద సినిమాలతో పాటు చిన్న మూవీస్ వచ్చినపుడు ఉదయం 11 నుంచి రాత్రి 9 గం. మధ్యలో వాటికి కచ్చితంగా ఒక షో కేటాయించాలనే కండిషన్ పెట్టింది. 100 కోట్లకు పై బడ్జెట్‌తో తీసే సినిమాలను సూపర్ హై బడ్జెట్‌గా పరిగణిస్తూ.. రిలీజైన మొదటి 10 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పించింది. ఇలా సూపర్ హై బడ్జెట్ కేటగిరీలో టికెట్ రేట్లు పెంచుకోవాలనుకునే నిర్మాతలు.. సినిమా కార్మికుల సంక్షేమ నిధి కోసం కోటి రూపాయల వరకు విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఆన్‌లైన్ బుకింగ్స్ అన్నీ పాత పద్ధతిలోనే నడుస్తాయని తెలిపిన ప్రభుత్వం.. ఈ కొత్త నిబంధనలన్నీ వెంటనే అమల్లోకి వస్తాయని ఈ జీవో ద్వారా స్పష్టం చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బురఖా డాన్స్‌.. స్కూల్‌ను సీజ్‌ చేసిన అధికారులు

రూమ్‌లో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. ఆ తర్వాత సీన్‌ చూస్తే వెన్నులో వణుకే!

యూట్యూబ్ వ్యూస్ లెక్కింపులో కీలక మార్పు.. ఆగస్టు 24 నుంచి కొత్త విధానం!

LPG: ఎల్పీజీ గ్యాస్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త!

లోన్ తీసుకునే వారికి అదిరిపోయే శుభవార్త! బ్యాంకుల ఇష్టారాజ్యానికి చెక్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *