
కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులతో కేంద్రం జరిపిన చర్చలు ముగిశాయి. కేంద్రమంత్రులు జేపీ నడ్డా, జితేంద్రసింగ్ సీజేపీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. నీట్ సహా విద్యావ్యవస్థలో కీలక అంశాలపై వీరి మధ్య చర్చ జరిగింది. ప్రధానంగా మూడు డిమాండ్లను సీజేపీ కేంద్రం ముందుంచింది. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటు నీట్ పేపర్ లీక్‌తో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం, విద్యార్థులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయొద్దని సీజేపీ ప్రతినిధులు డిమాండ్ చేశారు.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.