Dangerous Pitch Test Match: ఐదు రోజుల పాటు సాగాల్సిన ఒక ప్రతిష్టాత్మక టెస్ట్ మ్యాచ్ కనీసం ఒక్క గంట కూడా పూర్తి కాకుండానే అర్ధాంతరంగా నిలిచిపోయింది. మైదానంలో బంతి ఎటు నుంచి వచ్చి బాడీకి తగులుతుందో తెలియక వికెట్ల ముందు బ్యాటర్లు రక్తం చిందించిన ఆ భయంకర సంఘటన, క్రికెట్ చరిత్రలోనే చోటుచేసుకున్న నల్లటి రోజు విశేషాలు ఇప్పుడు చూద్దాం.
అది 1998వ సంవత్సరం.. ఇంగ్లాండ్ జట్టు వెస్టిండీస్ పర్యటనలో ఉంది. జమైకాలోని ప్రసిద్ధ సబీనా పార్క్ మైదానంలో తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ మైక్ ఆథర్టన్ ఆలోచించకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మ్యాచ్ చివర్లో పిచ్ స్పిన్‌కు అనుకూలించి బ్యాటింగ్ చేయడం కష్టమవుతుందని అతడు అంచనా వేశాడు. మ్యాచ్ మొదలైన కొన్ని నిమిషాలకే అతడి అంచనా ఎంత ఘోరంగా తప్పిందో అర్థమైంది. ఆ పిచ్ పరిస్థితులు చూసి చివర్లో కాదు, అసలు మ్యాచ్ ప్రారంభంలోనే బ్యాటింగ్ చేయడం అసాధ్యమని ఇరు జట్ల ఆటగాళ్లకు స్పష్టమైంది.
ఎక్కువమంది చదివింది: Video: దమ్ముంటే ఒక్క సిక్స్ కొట్టంటూ రెచ్చగొట్టిన పాక్ దిగ్గజం.. 4 వరుస బంతుల్లోనే నోర్మూయించిన సచిన్..
ఇవి కూడా చదవండి
భయంకరమైన బౌన్స్ – బ్యాటర్ల శరీరాలకు గాయాలు..
వెస్టిండీస్ తరపున ఆ సమయానికి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పేసర్లు కర్ట్లీ ఆంబ్రోస్, కోర్ట్నీ వాల్ష్ బౌలింగ్ చేస్తున్నారు. సాధారణ పిచ్‌లపైనే వీరి వేగాన్ని ఎదుర్కొని నిలబడటం ఏ బ్యాటర్‌కైనా పెద్ద సవాలు. అలాంటిది ఆనాటి సబీనా పార్క్ పిచ్ అసాధారణంగా ప్రవర్తించింది. ఒకే స్పాట్లో పడిన బంతుల్లో కొన్ని నేలను రాసుకుంటూ కింద నుంచి వెళ్తే, మరికొన్ని అనూహ్యంగా ఒక్కసారిగా పైకి లేచి నేరుగా బ్యాటర్ల ఛాతీ, ముఖాన్ని తాకాయి. విండీస్ బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ ఓపెనర్లు తీవ్రంగా గాయపడ్డారు. కనీసం డిఫెన్స్ చేసుకునే అవకాశం కూడా దక్కలేదు.
గంట వ్యవధిలో ఆరుసార్లు మైదానంలోకి ఫిజియో..
క్రీజులో నిలబడటమే ఒక నరకంగా మారడంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు కంటిన్యూగా గాయాల పాలయ్యారు. కేవలం గంట వ్యవధిలోనే ఫిజియో ఏకంగా ఆరుసార్లు మైదానంలోకి వచ్చి చికిత్స అందించాల్సి వచ్చింది. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి ఇంగ్లాండ్ స్కోరు 17 పరుగులకు 3 వికెట్లుగా నమోదైంది. పిచ్ స్థితిగతులు ఏమాత్రం సురక్షితం కాదని, ఆట కొనసాగిస్తే ఆటగాళ్ల ప్రాణాలకే ప్రమాదమని గుర్తించిన అంపైర్లు వెంటనే మ్యాచ్‌ను నిలిపివేశారు. భయంకరమైన పిచ్ కారణంగా టెస్ట్ మ్యాచ్‌ను రద్దు చేసి డ్రాగా ప్రకటించారు.
ఎక్కువమంది చదివింది: వరల్డ్ కప్ 2027 రేసు నుంచి ఆ 2 దిగ్గజ టీంలు ఔట్.. టీమిండియా పరిస్థితి ఏంటంటే?
121 ఏళ్ల టెస్ట్ చరిత్రలో ఏకైక రికార్డు..
సుదీర్ఘమైన 121 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో పిచ్ ప్రమాదకరంగా ఉందనే ఒకే ఒక్క కారణంతో మొదటి రోజే రద్దయిపోయిన మొట్టమొదటి మ్యాచ్‌గా ఇది నిలిచింది. ఈ పోరులో మొత్తం కేవలం 62 బంతులు మాత్రమే వేశారు. ఇన్ని తక్కువ బంతులు నమోదైనప్పటికీ, ఆటగాళ్లు, అధికారుల అధికారిక టెస్ట్ గణాంకాల రికార్డుల్లో ఈ మ్యాచ్‌ను పరిగణనలోకి తీసుకోవడం మరొక విశేషం. క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెర పరిచిన ఈ విచిత్ర సంఘటన నేటికీ క్రీడాభిమానుల మదిలో పచ్చిగానే ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..