Headlines

14 కి.మీ, 13 స్టేషన్‌లు.. 25 నిమిషాల్లో ఆవయవాలను హాస్పిటల్‌కు చేర్చిన మెట్రో! | Hyderabad Metro Turns Life Saver: Fast Tracks Organ Transport via Special Green Channel

14 కి.మీ, 13 స్టేషన్‌లు.. 25 నిమిషాల్లో ఆవయవాలను హాస్పిటల్‌కు చేర్చిన మెట్రో! | Hyderabad Metro Turns Life Saver: Fast Tracks Organ Transport via Special Green Channel


హైదరాబాద్‌ మెట్రో అరుదైన గనత సాధించింది. గ్రీన్‌ ఛానెల్‌ ద్వారా కేవలం 25 నిమిషాల్లోనే అవయవ రవాణా చేసి ఓ ప్రాణాన్ని నిలబెట్టేందుకు వేదికైంది. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి రసూల్‌పురా స్టేషన్ వరకు సాగిన ఈ ప్రత్యేక ప్రయాణం.14 కిలోమీటర్లు, 13 స్టేషన్ల పరిధిని కేవలం 25 నిమిషాల్లోనే రీచ్ అయింది. ఉదయం 11:40కి రాయదుర్గంలో స్టార్ట్‌ అయిన అధికారులు మధ్యాహ్నం 12:05 నిమిషాలకు రసూల్‌పురాకు చేరుకొని అక్కడి నుంచి కిమ్స్‌కు అవయాలను తరలించి ప్రయాణాన్ని సక్సెక్ చేశారు. ఈ మిషన్ విజయవంతం కావడంలో మెట్రో అధికారులు, వైద్య బృందాల ఎంతో కృషి చేశారు.

టైమ్-క్రిటికల్ ప్రాసెస్ అయిన అవయవ మార్పిడి కోసం ప్రైవేట్ వాహనాల్లో లేదా అంబులెన్స్‌లో వెళ్తే ట్రాఫిక్ చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో కేర్ ఆసుపత్రి (గచ్చిబౌలి) నుంచి సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్‌లోని కిమ్స్ ఆసుపత్రికి అవయవాలను సురక్షితంగా తరలించేందుకు హెచ్‌ఎమ్‌ఆర్‌ఎల్ (HMRL), ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

రాయదుర్గం మెట్రో స్టేషన్‌లో ప్రత్యేక గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి వైద్య బృందాన్ని ఎక్కించారు. 13 స్టేషన్లను దాటుకుంటూ నాన్-స్టాప్‌లా సాగిన ఈ రైలు, ఉదయం 11:40 గంటలకు రాయదుర్గంలో బయలుదేరి సరిగ్గా 12:05 గంటలకు రసూల్‌పురా స్టేషన్‌కు చేరుకుంది. అక్కడి నుంచి మినిస్టర్ రోడ్‌లోని కిమ్స్ ఆసుపత్రికి అంబులెన్స్ ద్వారా అవయవాలను సురక్షితంగా చేర్చారు.

ఈ ప్రక్రియ విజయవంతం కావడానికి సహకరించిన హైదరాబాద్ మెట్రో సిబ్బందికి, ట్రాఫిక్ పోలీసులకు మరియు వైద్యుల బృందానికి ఆసుపత్రి వర్గాలు, బాధితుల కుటుంబసభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *