Headlines

పిచ్చి చెట్టు అనుకుంటే మీరు తిక్కలోళ్లే.. ఆర్థరైటిస్ నొప్పులను అంతం చేసే మొనగాడు మూలిక | Gambhari gummadi teku Herb Benefits: The Ayurvedic Remedy That May Help Relieve Arthritis and Joint Pain

పిచ్చి చెట్టు అనుకుంటే మీరు తిక్కలోళ్లే.. ఆర్థరైటిస్ నొప్పులను అంతం చేసే మొనగాడు మూలిక | Gambhari gummadi teku Herb Benefits: The Ayurvedic Remedy That May Help Relieve Arthritis and Joint Pain


ప్రకృతిలో ఎన్నో రకాల ఔషధ మొక్కలు దాగున్నాయి.. అవి సహజ ఔషధాలుగా పనిచేయడంతోపాటు ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి. కొన్ని వందల సంవత్సరాల నుంచి మన ఆయుర్వేదంలో ఎన్నో రకాల మొక్కలను పలు రకాల చికిత్సలకు మెడిసిన్‌గా వాడుతున్నారు. అయితే.. మనకు తెలిసిన ఆయుర్వేద మూలికలు చాలానే ఉన్నప్పటికీ, అద్భుతమైన ఔషధ గుణాలు ఉండి చాలామందికి తెలియని మూలికల్లో ‘గంభారి’ (Gambhari) ఒకటి. దీనిని సాధారణంగా గుమ్మడి టేకు లేదా ‘చందహర చెట్టు’ అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం Gmelina arborea (గ్మెలినా అర్బోరియా).. ఈ చెట్టు హిమాలయాలు, నీలగిరి కొండలతో పాటు భారతదేశంలోని తూర్పు, పశ్చిమ తీర ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతుంది. ఆయుర్వేదంలో ప్రసిద్ధి చెందిన ‘దశమూల చూర్ణం’లో ఉపయోగించే ముఖ్యమైన మూలికల్లో ఇది ఒకటి.. ఇది ఆర్థరైటిస్ నొప్పులకు అద్భుతమైన ఆయుర్వేద మూలిక అని నిపుణులు చెబుతున్నారు.

ఆయుర్వేద నిపుణుల ఆధారంగా, గంభారి మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, ఆర్థరైటిస్ నొప్పులను తగ్గించడంలో దీని పాత్ర, దీనిని ఎలా ఉపయోగించాలో వివరంగా తెలుసుకుందాం..

గుమ్మడి టేకుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

ఆర్థరైటిస్ (కీళ్ల నొప్పుల) నివారణ: గంభారీలో అనాల్జేసిక్ (నొప్పి నివారిణి), యాంటీ ఇన్ఫ్లమేటరీ (వాపులను తగ్గించే) గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వల్ల వచ్చే వాపులు, నొప్పులను సమర్థవంతంగా తగ్గిస్తాయి.

వాత దోష సమతుల్యత: ఆయుర్వేదం ప్రకారం శరీరంలో ‘వాతం’ అసమతుల్యత వల్ల కీళ్ల నొప్పులు వస్తాయి. గంభారి శరీరంలోని వాతాన్ని సమతుల్యం చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

జీర్ణ సమస్యల నివారణ: ఈ మూలికలో ఉన్న లాక్సేటివ్ (Laxative) గుణాలు రకరకాల జీర్ణ సంబంధిత సమస్యలను నివారించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

గంభారీని ఎలా ఉపయోగించాలి?

గంభారీని ఆరోగ్య ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. శరీరానికి అంతర్గతంగా (నోటి ద్వారా తీసుకోవడం), బాహ్యంగా (పైపూతగా) కూడా ఉపయోగించవచ్చు:

ఆకుల వినియోగం: గంభారి (గుమ్మడి టేకు) ఆకులను కషాయంగా లేదా నేరుగా తీసుకోవడం, లేదా ఆకుల పేస్ట్‌ను నొప్పులు ఉన్నచోట పైపూతగా రాయడం వల్ల ఆర్థరైటిస్ నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది.

పొడి రూపంలో: ప్రస్తుతం మార్కెట్‌లో గంభారి చూర్ణం/పొడి లభిస్తోంది.

మోతాదు: 2 నుండి 3 గ్రాముల గంభారి పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి రోజుకు 1 లేదా 2 సార్లు తీసుకోవచ్చు.

ఈ చూర్ణాన్ని తప్పనిసరిగా భోజనం చేసిన తర్వాతే తీసుకోవాలి.

జాగ్రత్తలు:

అధిక మోతాదు ప్రమాదకరం: గంభారీని పరిమితికి మించి ఎక్కువ మోతాదులో తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ (దుష్ప్రభావాలు) వచ్చే అవకాశం ఉంది.

వైద్యుని సలహా తప్పనిసరి: దీనిని వాడటం ప్రారంభించే ముందు ఒక అర్హత కలిగిన ఆయుర్వేద వైద్యుడిని (Doctor) సంప్రదించి, మీ శరీర తత్వానికి తగిన మోతాదును తెలుసుకోవడం శ్రేయస్కరం.

ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన ఆయుర్వేద మూలికల్లో గంభారి ఒకటి. సరైన మోతాదులో, నిపుణుల సలహాతో దీనిని ఉపయోగిస్తే కీళ్ల నొప్పుల నుండి సహజంగా ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏమైనా అనారోగ్య సమస్యలుంటే నేరుగా వైద్య నిపుణులను సంప్రదించండి..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *