Headlines

Weather Report: వాయుగుండం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో 3 రోజుల పాటు భారీ వర్షాలు! | Weather forecast: Bay of Bengal Deep Depression Triggers 3 Day Heavy Rain Alert for AP and Telangana

Weather Report: వాయుగుండం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో 3 రోజుల పాటు భారీ వర్షాలు! | Weather forecast: Bay of Bengal Deep Depression Triggers 3 Day Heavy Rain Alert for AP and Telangana


వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్-ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలను ఆనుకుని ఉన్న ప్రాంతాలలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గత 6 గంటలలో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా ఉత్తరం వైపు కదులుతూ సోవారం ఉదయానికి 21.4° ఉత్తర అక్షాంశం, 88.1° తూర్పు రేఖాంశం సమీపంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది సాగర్ ద్వీపానికి సుమారు 30 కిలోమీటర్ల దక్షిణంగా, దిఘాకు 70 కిలోమీటర్ల తూర్పు-ఆగ్నేయంగా, డైమండ్ హార్బర్‌కు 90 కిలోమీటర్ల దక్షిణంగా, కానింగ్‌కు 110 కిలోమీటర్ల దక్షిణ-నైరుతిగా, బాలాసోర్‌కు 120 కిలోమీటర్ల తూర్పు-ఆగ్నేయంగా దూరంలో ఉందని స్పస్టం చేసింది.

ఇది దాదాపు ఉత్తర-వాయువ్య దిశగా కదిలి, సోమవారం మధ్యాహ్నం సమయంలో బాలాసోర్, కానింగ్ మధ్య పశ్చిమ బెంగాల్-ఉత్తర ఒడిశా తీరాలను దాటే అవకాశం ఉందని.. అలాగే సగటు సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి బికానెర్, గ్వాలియర్, వారణాసి, జంషెడ్‌పూర్, వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్-ఉత్తర ఒడిశా తీరప్రాంతాలలోని ఆనుకొని ఉన్న తీవ్ర వాయుగుండం కేంద్రం గుండా ప్రయాణిస్తూ, అక్కడి నుండి ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వైపు వెళుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాలు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పస్టం చేసింది.

రాష్ట్రంలోని ఈ జిల్లాలలో రాబోయే మూడు రోజులు వాతావరణం ఇదే

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ ,యానాం : వాయుగుండం ప్రభావంతో ఈ జిల్లాల్లో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. వర్షాల సమయంలో గంటకు 50-60 కిలోమీటర్ల వేగముతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశముంది వాతావరణ శాఖ తెలిపింది. అలాగే వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశముందని స్పష్టం చేసింది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్: ఈ జిల్లాల్లో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఈ జిల్లా్ల్లో వర్షంతో పాటు గంటలకు 40-50 కిలోమీటర్ల వేగముతో ఈదురుగాలుఉ వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

రాయలసీమ: ఇక రాయలసీమలో నూ రాబోయే మూడ్రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని.. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని.. ఈదురుగాలులు గంటలకు 40-50 కిలో మీటర్ల వేగంతో వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ స్పస్టం చేసింది.

తెలంగాణలో వాతావరణం 

అలాగే వాయుగుండం ప్రభావంతో ఇటు తెలంగాణలో కూడా వర్షాలు కురువనున్నట్టు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. మరికొన్ని జిల్లా్ల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ పేర్కొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *