Headlines

చిప్స్ ప్యాకెట్లో ఉండే గాలిలో ఇంత కథ ఉందా.. అందులో అసలేం వాడతారో తెలుసా..? | Why chips packets filled with air nitrogen gas science behind chips packaging

చిప్స్ ప్యాకెట్లో ఉండే గాలిలో ఇంత కథ ఉందా.. అందులో అసలేం వాడతారో తెలుసా..? | Why chips packets filled with air nitrogen gas science behind chips packaging


Chips Packet Air Reason: చిప్స్ ప్యాకెట్ విప్పగానే సగానికి పైగా గాలితో నిండి ఉండడం చూస్తుంటాం. ఇది చూసి చాలామంది కంపెనీలు మనల్ని మోసం చేస్తున్నాయని అనుకుంటారు. కానీ, ఆ గాలి మిమ్మల్ని మోసం చేయడానికి కానే కాదు. మనం కరకరలాడే చిప్స్ రుచిగా తినడం వెనుక ఓ అద్భుతమైన సైన్స్ దాగి ఉంది!

మోసం కాదు.. చిప్స్‌కు శ్రీరామరక్ష..!

మనం షాప్‌లో కొనే చిప్స్ ప్యాకెట్ మన చేతికి అందే ముందు వందల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఫ్యాక్టరీ నుంచి రవాణా అయ్యే సమయంలో చిప్స్ ఒకదానికొకటి తగిలి నలిగిపోకుండా ఉండటానికి ఈ గాలి ఓ ‘ఎయిర్‌బ్యాగ్’ లాగా పనిచేస్తుంది. ప్యాకెట్ లోపల గాలి గనుక లేకపోతే, మనకు చేతికి వచ్చేసరికి అది చిప్స్ లా కాకుండా పొడి పొడిగా మారిపోతుంది. అందుకే కంపెనీలు ప్యాకెట్లో కొంత గాలిని నింపుతాయి.

అది మనం పీల్చే సాధారణ గాలి కానే కాదు..!

చాలామంది ఆ ప్యాకెట్లో ఉన్నది మనం రోజువారీ పీల్చే గాలి అనుకుంటారు. కానీ, అది నిజానికి నైట్రోజన్ వాయువు. సాధారణ గాలిలో ఆక్సిజన్, తేమ ఉంటాయి. ఇవి చిప్స్ తయారు చేసే నూనెతో చర్య జరిపి, వాటిని త్వరగా పాడుచేస్తాయి. అంతేకాదు, నూనె వాసన రావడం, చిప్స్ మెత్తబడిపోవడం వంటివి జరుగుతాయి. నైట్రోజన్ వాయువు వాడటం వల్ల ఇలాంటి సమస్యలన్నీ తక్షణమే తొలగిపోతాయి.

నెలల తరబడి కరకరలాడే రుచికి రహస్యం..

నైట్రోజన్ వాయువు వల్ల చిప్స్ చెడిపోకుండా ఉండటమే కాకుండా, వాటి ఒరిజినల్ రుచి, కరకరలాడే తనం (Crispiness) నెలల తరబడి అలాగే ఉంటాయి. ఎలాంటి రసాయనాలు వాడకుండానే ఆహారాన్ని ఫ్రెష్‌గా ఉంచేందుకు ఇది అత్యంత సురక్షితమైన మార్గంగా నిపుణులు చెబుతున్నారు. ఈ వాయువు వల్ల చిప్స్ నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది.

ఆ గాలే లేకపోతే ఏమవుతుంది..?

ఒకవేళ ప్యాకెట్లో ఈ నైట్రోజన్ వాయువును నింపకపోతే, మనకు కరకరలాడే కరకరలాడే చిప్స్‌కు బదులుగా మెత్తబడిన, నుజ్జునుజ్జయిన చిప్స్ మాత్రమే దక్కుతాయి. కాబట్టి ఇకపై చిప్స్ ప్యాకెట్ తెరవగానే గాలి కనిపిస్తే మోసపోయామని బాధపడకండి. ఆ గాలే మీకు క్వాలిటీ చిప్స్‌ను అందిస్తోందని గుర్తుంచుకోండి!

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *