Headlines

Kuja Gochar 2026: మిథున రాశిలోకి కుజుడు..వారి జీవితాల్లో తిరుగులేని విజయాలు..! | Mars Transit into Gemini 2026: These Zodiac Signs May Experience Major Success and Life Changing Opportunities

Kuja Gochar 2026: మిథున రాశిలోకి కుజుడు..వారి జీవితాల్లో తిరుగులేని విజయాలు..! | Mars Transit into Gemini 2026: These Zodiac Signs May Experience Major Success and Life Changing Opportunities


ప్రధాన గ్రహాలు రాశులు మారినప్పుడల్లా కొన్ని రాశుల వారి జీవితాల్లో మార్పులు చోటు చేసుకుంటుంటాయి. ఈ మార్పులు కొన్ని రాశులకు మోదం కలిగించడం, కొన్ని రాశులకు ఖేదం కలిగించడం సహజమే. నెల రోజులకు పైగా వృషభ రాశిలో ఉన్న కుజుడు మిథున రాశిలోకి మారడం వల్ల కొన్ని రాశుల వారు అందలాలు ఎక్కడం జరుగుతోంది. నెలన్నర పాటు వీరి జీవితాల్లో విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆగస్టు 3వ తేదీ నుంచి సెప్టెంబర్ సెప్టెంబర్ 18 వరకు కుజుడు మిథునంలో సంచారం చేస్తున్నప్పుడు మేషం, సింహం, కన్య, తుల, ధనుస్సు, మకర రాశుల వారి జీవితాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటాయి.

  1. మేషం: రాశినాథుడైన కుజుడు తృతీయ స్థానంలో ప్రవేశించడం వల్ల ఈ రాశివారి జీవితంలో అంచనాలను మించిన పురోగతి ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సక్సెస్ అవుతుంది. కొన్ని కష్టనష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. కొద్ది ప్రయత్నంతో అత్యధికంగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి.
  2. సింహం: ఈ రాశికి లాభ స్థానంలో కుజుడి ప్రవేశం వల్ల కొద్ది ప్రయత్నంతో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. రావలసిన డబ్బును, బాకీలను రాబట్టుకుంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశించిన లాభాలను ఇస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు కనక వర్షం కురిపిస్తాయి. రాజకీయ నేతలతో సన్నిహిత సంబంధాలు పెంపొందుతాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఆరోగ్య లాభం కలుగుతుంది.
  3. కన్య: ఈ రాశికి దశమ స్థానంలో కుజ సంచారం వల్ల ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులు మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. విదేశీయానానికి మార్గం సుగమమవుతుంది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదం పరిష్కారమై భూలాభం కలుగుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.
  4. తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో కుజ గ్రహ ప్రవేశం వల్ల తప్పకుండా ఆదాయం వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఆస్తి లాభం కలుగుతుంది. విదేశాల్లో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. ఉద్యో గంలో ఆశించిన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు కలుగుతాయి. సమాజంలో ఒక ప్రముఖుడుగా ఆశించిన గుర్తింపు లభిస్తుంది.
  5. ఇవి కూడా చదవండి



  6. ధనుస్సు: ఈ రాశికి సప్తమ స్థానంలో కుజ సంచారం వల్ల కలలో కూడా ఊహించని ధనలాభం కలుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై ఆస్తి లాభం కలుగుతుంది.. సంపన్న కుటుంబంతో పెళ్లి నిశ్చయం అవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోయి, అన్యోన్యత పెరుగుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది.
  7. మకరం: ఈ రాశికి ఆరవ స్థానంలో కుజ సంచారం వల్ల ఆదాయం వృద్ధి చెంది ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయి. ఆస్తి సమస్యలు, వివాదాలు సానుకూలంగా సమసిపోతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. కొద్ది ప్రయత్నంతో నిరుద్యోగులకు ఉద్యోగం, ఉద్యోగులకు మరింత మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. బంధు మిత్రుల నుంచి ఆదరణ పెరుగుతుంది. సామాజికంగా ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *