Headlines

Raasi: ఆ హీరోతో సినిమాను మిస్సయ్యా.. అందుకు చాలా బాధపడ్డాను.. హీరోయిన్ రాశి.. | Actress Raasi Said She Missed movie With Megastar Chiranjeevi

Raasi: ఆ హీరోతో సినిమాను మిస్సయ్యా.. అందుకు చాలా బాధపడ్డాను.. హీరోయిన్ రాశి.. | Actress Raasi Said She Missed movie With Megastar Chiranjeevi


హీరోయిన్ రాశి రాశి తన సినీ కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవిగారితో కలిసి నటించాల్సిన ఒక భారీ చిత్రాన్ని, అలాగే అరుంధతి వంటి బ్లాక్‌బస్టర్ సినిమాను తాను ఎలా కోల్పోయిందో వెల్లడించారు. రాశి మాట్లాడుతూ, “చిరంజీవి సార్ నటించిన స్నేహం కోసం (తమిళంలో నట్పు కాగలో సిమ్రన్ పాత్ర) సినిమాను నేను చేయాల్సి ఉంది. అయితే, అప్పట్లో తెలుగులో నాకు డేట్స్ లేవు. నేను పూర్తి బిజీగా ఉండేదాన్ని, ఒక రోజుకు నాలుగు సినిమాల షూటింగ్‌లకు హాజరయ్యేదాన్ని. కే.ఎస్. రవికుమార్ సార్ మా నాన్నకు బాగా సన్నిహితులు. ఆయన వచ్చి నా డేట్స్ అడిగారు, కానీ నా షెడ్యూల్ వల్ల ఆ సినిమా చేయలేకపోయాను. అది పెద్ద మిస్సింగ్.” ఆ సినిమా పెద్ద సక్సెస్ కావడంతో, చిరంజీవిగారితో నటించే అవకాశం కోల్పోయినందుకు ఆమె విచారం వ్యక్తం చేశారు.

అలాగే, కెరీర్‌లో తాను అత్యంత బాధపడిన మిస్‌ఫైర్ అరుంధతి సినిమా అని రాశి చెప్పారు. తనకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆ సినిమా పెద్ద హిట్ అయ్యిందని, రెండు మూడేళ్ల తర్వాత కోడి రామకృష్ణ అంకుల్‌ను ఒక ఫంక్షన్‌లో కలిసినప్పుడు “నేను నిజంగా అప్పుడు కరెక్ట్‌గా ఉండుంటే నాకు ఏమైనా ఛాన్స్ వచ్చేదా?” అని అడిగానని తెలిపారు. దానికి ఆయన “నిన్ను ఎవరే అంత తొందరగా పెళ్లి చేసుకోమన్నారు?” అని సరదాగా అన్నారని రాశి పంచుకున్నారు. పెళ్లి చేసుకున్నందుకా, పాత్ర మిస్ అయినందుకా అని అడిగినప్పుడు, రెండూ అని సమాధానమిచ్చారు. “ఇలాంటి సినిమా వస్తుందని తెలిసుంటే ఒక రెండు సంవత్సరాలు పెళ్లి పోస్ట్‌పోన్ చేసేదాన్ని,” అని నవ్వూతూ చెప్పారు.

కేవలం 22 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవడంపై అప్పట్లో పరిశ్రమలో చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారని రాశి గుర్తు చేసుకున్నారు. “రాశి ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేసింది? ఈ టైంలో పెళ్లి చేసుకోవడం ఏంటి?” అని చాలామంది అనుకున్నారని తెలిపారు. పెళ్లి చేసుకోవాలని తాను ఏడాది ముందుగానే నిర్ణయించుకున్నానని, తన భర్త నివాస్‌ను కలిసిన తర్వాత ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు సినిమా షూటింగ్‌లో పరిచయం ఏర్పడిందని చెప్పారు. కేవలం ఒకటిన్నర నెలలోనే వారి పెళ్లి జరిగిపోయిందని వెల్లడించారు.

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో చాలా గొప్ప మనిషి.. ఆయన పేరు వినగానే రజినీకాంత్ సిగరెట్ పడేసి నిలబడ్డారు.. తనికెళ్ల భరణి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *