Headlines

మేం విడిపోవడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పిన హీరో సుమంత్ | Hero sumanth interesting comments about his divorce with Keerthi Reddy

మేం విడిపోవడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పిన హీరో సుమంత్ | Hero sumanth interesting comments about his divorce with Keerthi Reddy


నటుడు సుమంత్ తన సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఆచితూచి సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు. సుమంత్ నటించిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. సుమంత్ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో చాలా క్లాసిక్ సినిమాలు ఉన్నాయి. సత్యం, గోదావరి, గోల్కొండ హై స్కూల్, మళ్లీ రావా, సీతారామం , అనగనగా ఇలా చాలా సినిమాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు మహేంద్రగిరి వారాహి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు సుమంత్. ఇదిలా ఉంటే గతంలో సుమంత్ ఓ ఇంటర్వ్యూలో తన మాజీ భార్య గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గతంలో ఆయన మాట్లాడుతూ.. తన మాజీ భార్య కీర్తి రెడ్డితో విడాకులు, వ్యక్తిగత జీవితం, వివాహంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. కీర్తి రెడ్డితో విడాకులు తీసుకున్నప్పటికీ, తాము ఇప్పటికీ మంచి స్నేహితులుగానే కొనసాగుతున్నామని సుమంత్ వెల్లడించారు. అంతేకాకుండా, కీర్తి రెడ్డి కుటుంబంతో కూడా తన స్నేహం చెక్కుచెదరలేదని, తరచూ వారితో మాట్లాడుతుంటానని సుమంత్ స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి : వారెవ్వా..! చంద్రముఖి చిన్నారి ఎంత మారిపోయింది..!! ఇప్పుడు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే

విడాకుల తర్వాత కూడా ఇలాంటి సత్సంబంధాలు ఎలా సాధ్యమని ప్రశ్నించగా, తామిద్దరం మంచి మనుషులమని, ఒకరినొకరు క్షమించుకుని, పాత విషయాలను మరిచిపోయి జీవితంలో ముందుకు సాగామని సుమంత్ వివరించారు. ఈ పరిణతితో కూడిన వైఖరి తమకు సత్సంబంధాలను కొనసాగించడానికి సహాయపడిందని ఆయన పేర్కొన్నారు. కీర్తి రెడ్డి వేరొకరిని వివాహం చేసుకుని స్థిరపడగా, సుమంత్ మాత్రం ప్రస్తుతం ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. తనకు మళ్లీ వివాహం చేసుకోవాలనే ఆలోచన లేదని, ఒంటరిగా ఉండటంతో తాను ఎంతో సంతోషంగా, సంతృప్తిగా ఉన్నానని పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతారని, తాను కూడా వారిలో ఒకడినేమో అని అభిప్రాయపడ్డారు. “మానవునికి తోడు అవసరం” అనే భావనను తాను నమ్మనని, తోడు కేవలం మనుషులతోనే కాకుండా, పెంపుడు జంతువులతో కూడా ఉండవచ్చని సుమంత్ సరదాగా అన్నారు.

ఇది కూడా చదవండి : 21 సినిమాలు చేస్తే.. మూడు మాత్రమే హిట్..! కట్ చేస్తే విలన్‌గానూ అదరగొట్టాడు

అలాగే ఆయన మాట్లాడుతూ.. మా పెళ్లైనప్పుడు మా ఇద్దరికీ సరైన మెచ్యూరిటీ లేదు. అందుకే ఆతర్వాత విడిపోయాం. మేం విడిపోవడానికి అదొక్కటే కారణం. మా ఇద్దరి లైఫ్ ఒకరకంగా సినిమా స్టోరీలా సాగింది అని అన్నారు. తాను ప్రస్తుతం ఒంటరిగా ఉన్నందున స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నానని పరోక్షంగా తెలిపారు. భవిష్యత్తులో ఎప్పుడైనా తోడు అవసరమని అనిపిస్తే, అప్పుడు దాని గురించి ఆలోచిస్తానని సుమంత్ పేర్కొన్నారు. ప్రస్తుతానికి తన జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తున్నానని సుమంత్ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి



ఇది కూడా చదవండి : Raja Ravindra: ఆ హీరో పెళ్ళికి నేను కాళ్లు కడిగాను.. ఆ ఇద్దరూ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్..!!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *