Headlines

ఓటీటీ డౌన్.. సినిమా లాంగ్ రన్.. టైమ్ వచ్చిందా..? | Are Theatres Making a Comeback as OTT Platforms Lose Momentum video – Entertainment Videos in Telugu

ఓటీటీ డౌన్.. సినిమా లాంగ్ రన్.. టైమ్ వచ్చిందా..? | Are Theatres Making a Comeback as OTT Platforms Lose Momentum video – Entertainment Videos in Telugu


ఒకప్పుడు ఆడియన్స్‌ను ఇళ్లకే పరిమితం చేసిన ఓటీటీల హవా తగ్గిందా.. ప్రేక్షకులు మళ్లీ థియేటర్ల బాట పడుతున్నారా..? గ్లోబల్ కంటెంట్ లేక ఓటీటీలు నష్టపోతుంటే అదే థియేటర్లకు ప్లస్‌గా మారుతుందా..? హాలీవుడ్ 2 టాలీవుడ్ వరకు మళ్లీ హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తుండటంతో బిగ్ స్క్రీన్ తిరిగి తన పూర్వవైభవాన్ని సంతరించుకుందా..? థియెట్రికల్ మార్కెట్ వెనక ఏం జరుగుతుందో ఎక్స్‌క్లూజివ్‌గా అనలైజ్ చేద్దాం.. వరల్డ్ వైడ్‌గా కొన్ని నెలల నుంచి థియెట్రికల్ మార్కెట్ పెరిగి.. ఓటిటి డౌన్ అవుతుంది. ఇది మనం చెప్తున్నది కాదు లెక్కలు చెప్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ లాంటి సంస్థ షేర్ వాల్యూ గతేడాది కాలంలో దాదాపు 42 శాతం తగ్గిందని తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం కొత్త కంటెంట్ లేకపోవడమే. కరోనా టైంలో మనీ హైస్ట్ సహా ఎన్నో సిరీస్‌లు, సినిమాలతో వచ్చినా.. ఆ తర్వాత ఆ జోరు కంటిన్యూ చేయలేదు ఈ సంస్థ. అన్ని ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్స్ కంటెంట్ లేమితో సతమతమవుతున్నాయి. అక్కడ సరైన కంటెంట్ లేకపోవడంతో థియేట్రికల్ ఎక్స్‌‌‌పీరియన్స్ కోసం ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు క్యూ కడుతున్నారు. కేవలం 1 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘అబ్సెషన్’ 500 మిలియన్ డాలర్లు వసూలు చేయడమే దీనికి పెద్ద నిదర్శనం. ఈ మార్పు హాలీవుడ్‌కు మాత్రమే కాదు.. తెలుగులోనూ కనిపిస్తుంది. జూన్ నుంచి ‘పెద్ది’, ‘మా ఇంటి బంగారం’, ‘లెనిన్’, ‘చెన్నై లవ్ స్టోరీ’ లాంటి సినిమాలు థియేటర్లకు ప్రేక్షకులను భారీగా రప్పించగలిగాయి. చాలా కాలం తర్వాత థియేటర్ల ముందు మళ్లీ హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తుండటంతో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లలో కొత్త ఉత్సాహం నెలకొంది. బాక్సాఫీస్ దగ్గర మొదలైన ఈ జోరును కొనసాగించాల్సిన బాధ్యత టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులపైనే ఉంది. ముఖ్యంగా స్టార్స్ ఆలస్యం చేయకుండా సినిమాలను త్వరగా పూర్తి చేసి ఏడాదికి కనీసం ఒకట్రెండు చిత్రాలైనా విడుదల చేస్తూ.. ఓటిటి డౌన్ ఉన్న ఈ సమయంలోనే క్రమం తప్పకుండా మంచి సినిమాలు థియేటర్లలోకి వస్తే ఈ మార్కెట్ మరింత కాలం నిలబడుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వాట్‌ ఏన్‌ ఐడియా టీచర్ జీ.. అగ్గిపెట్టెలతో అటెండెన్సా!

లక్ష ఇస్తే.. 2 లక్షలు చేస్తాం.. మాయా లేదు మంత్రం లేదు!

Viral Video: ఎనర్జీ డ్రింక్ టిన్‌లో ఇరుక్కున్న పాము.. బయటికి రాలేక విలవిల

మాట నిలబెట్టుకున్న సర్పంచ్‌.. ప్రశంసలు కురిపిస్తున్న స్థానికులు

తిరుమలలో పాలలా మారిన నీళ్లు.. తిరుమలలో పాలలా మారిన నీళ్లు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *