Headlines

ఇండియన్ బాక్సాఫీస్‌పై హలీవుడ్ ఆధిపత్యం | Hollywood’s Box Office Boom: English Films Are Shaking Up India video – Entertainment Videos in Telugu

ఇండియన్ బాక్సాఫీస్‌పై హలీవుడ్ ఆధిపత్యం | Hollywood’s Box Office Boom: English Films Are Shaking Up India video – Entertainment Videos in Telugu


ఇండియాలో హాలీవుడ్ సినిమాలు ఎవరు చూస్తారు.. చూసినా మన సినిమాలను డిస్టర్బ్ చేసే రేంజ్ వాటికెక్కడ ఉంటుంది అనుకుంటారు. కానీ ఈ మధ్య సీన్ మారిపోతుంది. ఇంగ్లీష్ మూవీస్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రఫ్ ఆడిస్తున్నాయి.. ఏ మాత్రం లైట్ తీసుకున్నా మన సినిమాలకే ఎర్త్ పెడుతున్నాయి. తాజాగా కొన్ని హాలీవుడ్ సినిమాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ది ఒడిస్సీ.. గత వారం రోజులుగా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర బాగా వినిపిస్తున్న పేరు ఇది. క్రిస్టోఫర్ నోలెన్ తెరకెక్కించిన ఈ చిత్రం టాక్‌తో పనిలేకుండా కలెక్షన్స్ కొల్లగొడుతుంది. వరల్డ్ వైడ్‌గా 6 రోజుల్లో 3000 కోట్లు వసూలు చేసిన ఒడిస్సీ.. ఇండియాలోనే 105 కోట్లు దాటేసింది. గ్రీకు కవి రాసిన హోమర్ అనే కావ్యం ఆధారంగా ఒడిస్సీని తీశారు నోలెన్. పూర్తిగా ఐమాక్స్ కెమెరాలతో తీసిన ది ఒడిస్సీ టికెట్ ధరలు మెట్రో సిటీస్‌లో 3 వేల వరకు ఉన్నా కూడా ఎగబడి కొంటున్నారు ఆడియన్స్. ఇక అబ్సెషన్ కూడా మొన్నటి వరకు బాగానే ట్రెండ్ అయింది. మైఖేల్ జాన్స్టన్, ఇండే నవారెట్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఫేమస్ యూ ట్యూబర్ కర్రీ బార్కర్ డైరెక్ట్ చేసారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన అబ్సెషన్.. ఇండియాలోనూ 87 కోట్లు వసూలు చేసింది. స్పైడర్ మ్యాన్ ఫ్రాంచైజీకి ఇండియాలో ఉన్న బ్రాండ్ గురించి కొత్తగా చెప్పడానికేం లేదు. తాజాగా స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే జూలై 30న విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. వరల్డ్ వైడ్‌గా జూలై 31న విడులవుతుంటే.. మన దగ్గర ఓరోజు ముందే వస్తున్నాడు స్పైడర్ మ్యాన్. మొత్తానికి ఈ హాలీవుడ్ మూవీస్ అన్నీ రప్ఫాడిస్తున్నాయిపుడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వాట్‌ ఏన్‌ ఐడియా టీచర్ జీ.. అగ్గిపెట్టెలతో అటెండెన్సా!

లక్ష ఇస్తే.. 2 లక్షలు చేస్తాం.. మాయా లేదు మంత్రం లేదు!

Viral Video: ఎనర్జీ డ్రింక్ టిన్‌లో ఇరుక్కున్న పాము.. బయటికి రాలేక విలవిల

మాట నిలబెట్టుకున్న సర్పంచ్‌.. ప్రశంసలు కురిపిస్తున్న స్థానికులు

తిరుమలలో పాలలా మారిన నీళ్లు.. తిరుమలలో పాలలా మారిన నీళ్లు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *