Headlines

AP సైంటిస్ట్‌కు రూ.3.6 కోట్ల డెన్మార్క్ ఫెలోషిప్.. Fava Beans సాగుతో కాసుల పంట | Anantapur Horticulture Scientist Bathineni Vimala Wins Rs 3.6 Crore Denmark Fellowship

AP సైంటిస్ట్‌కు రూ.3.6 కోట్ల డెన్మార్క్ ఫెలోషిప్.. Fava Beans సాగుతో కాసుల పంట | Anantapur Horticulture Scientist Bathineni Vimala Wins Rs 3.6 Crore Denmark Fellowship


అనంతపురం, జులై 22: అనంతపురం జిల్లాకు చెందిన ఉద్యాన శాస్త్రవేత్త బాతినేని విమలకు అరుదైన అవకాశం దక్కింది. రేకులకుంట ఉద్యాన పంటల పరిశోధన స్థానం (Horticultural Research Station)లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న ఆమె.. డెన్మార్క్ ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు. ఈ ఫెలోషిప్‌లో భాగంగా డెన్మార్క్‌లోని సదరన్ యూనివర్సిటీ ఆఫ్ డెన్మార్క్లో మూడేళ్ల పాటు పరిశోధనలు చేయనున్నారు. ఇందుకోసం ఆమెకు సుమారు రూ.3.6 కోట్ల ఆర్థిక సహాయం అందనుంది.

డెన్మార్క్‌లో సోయాబీన్ దిగుమతులకు ప్రత్యామ్నాయంగా ఫావా బీన్స్ (Fava Beans) సాగును ప్రోత్సహించే అవకాశాలపై ఆమె పరిశోధన చేయనున్నారు. ముఖ్యంగా ఫావా బీన్స్ సాగుకు అనుకూలమైన ప్రాంతాలను గుర్తించడం, ఆ సాగు వల్ల కలిగే పర్యావరణ ప్రభావాలు, ఆర్థిక ప్రయోజనాలు, వ్యవసాయ రంగంపై పడే ప్రభావాలను అంచనా వేయడం ఈ పరిశోధనలో ప్రధాన అంశాలుగా ఉండనున్నాయి. వ్యవసాయ రంగంలో సుస్థిర పద్ధతుల అభివృద్ధి, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం లక్ష్యంగా ఈ పరిశోధన సాగనుంది. అనంతపురం ప్రాంతానికి చెందిన శాస్త్రవేత్త అంతర్జాతీయ స్థాయి ఫెలోషిప్‌కు ఎంపిక కావడం పట్ల వ్యవసాయ, ఉద్యాన పరిశోధన వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

బాతినేని విమల పరిశోధన భవిష్యత్‌లో రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించడంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా సుస్థిర వ్యవసాయ విధానాల రూపకల్పనకు ఉపయోగపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *