Headlines

Lancet Report :ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులు వాడుతున్నారా? జాగ్రత్త.. తాజా నివేదికలో షాకింగ్ నిజాలు!

Lancet Report :ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులు వాడుతున్నారా? జాగ్రత్త.. తాజా నివేదికలో షాకింగ్ నిజాలు!


Lancet Report :ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులు వాడుతున్నారా? జాగ్రత్త.. తాజా నివేదికలో షాకింగ్ నిజాలు!

మన అనారోగ్యానికి గురైనప్పుడు ఉపయోగించే యాంటీబయాట్స్ మందులపై ది ల్యాన్సెట్ పబ్లిక్ హెల్త్‌లో ప్రచురితమైన ఓ ఆధ్యయనం షాకింగ్ విషయాలను బయటపెట్టింది. సాధారణ ఇన్ఫెక్షన్లకు వాడాల్సిన ముందులను తగ్గించి.. ప్రతికూల పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాల్సిన శక్తివంతమైన ఔషధాలను అతిగా వాడుతుండటం వల్ల సూక్ష్మజీవుల నిరోధకత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. యాంటిబయాటిక్స్‌ను యాక్సెస్, వాచ్ , రిజర్వ్ అనే 3 రకాలుగా విభజించింది.వీటిని పరిస్థితి తీవ్రతను బట్టి వాడాలని సూచిందింది. ఒకటి యాక్సెస్ మందులు వీటని సాధారణ ఇన్‌ఫెక్షన్లకు వాడుతారు. వీటి వాడకం వల్ల పెద్దగా ప్రమాదం ఉండదు. ఇంకోటి వాచ్.. వీటిని విస్తృత స్థాయి వ్యాధుల నివారణకు వాడుతారు. వీటిని పరిమితంగా మాత్రమే వాడాలి. ఇక మూడోది రిజర్వ్.. ఒక సమస్యకు ఏ ఇతర మందులూ పనిచేయనప్పుడు మాత్రమే మల్టీ-డ్రగ్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్ల చికిత్సకు వీటిని మాడుతారు.

అవసరానికి మంచిన వినియోగం

కానీ తాజా అధ్యయనం ప్రకారం.. దేశంలో వీటికి వినియోగం నియంత్రణ తప్పిందని పేర్కొంది. సాధారణంగా రోజుకు14.7 మోతాదుల యాంటిబయోటిక్స్ అవసరంగా కాగా.. వినియోగం మాత్రం 18.3 మోతాదుకు చేరినట్టు తేలింది. అయితే మొత్తం ఔషదాల వినియోగంలో యాక్సెస్ ఔషదాల శాతం 52.3 ఉండాల్సి ఉండగా భారత్‌లో అది కేవలం 27 శాతం మాత్రమే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. చాలా మంది డాక్టర్లు అనవసరంగానే వాచ్ ఔషదాలను పేషెంట్లకు సూచిస్తున్నట్లు తేలింది.

దుర్వినియోగం

చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు, జలుబు, వైరల్ జ్వరాలకు కూడా అవసరం లేకుండా యాంటిబయోటిక్స్ వాడటం వల్ల శరీరం ఆ మందులకు అలవాటుపడిపోతోందని తెలిపింది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా నేరుగా మెడికల్ షాపుల్లో యాంటిబయోటిక్స్ లభించడం కూడా దీనికి ప్రధాన కారణమని తెలిపింది. పరిమితికి మించిన వాడకం వల్ల బాక్టీరియా రూపాంతరం చెంది, శక్తివంతమైన యాంటిబయోటిక్స్ వేసినా ఇన్ఫెక్షన్లు తగ్గని పరిస్థితి ఏర్పడుతోంది.దీనివల్ల సాధారణ జబ్బుల చికిత్స కూడా క్లిష్టంగా మారే ప్రమాదం ఉందని నివేదిక తెలిపింది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • సరైన వైద్య సలహా: డాక్టర్ సూచించిన డోసేజ్, సమయం వరకు మాత్రమే యాంటిబయోటిక్స్ వాడాలి.
  • స్వయం వైద్యం నివారించడం: మెడికల్ షాపుల్లో నేరుగా వెళ్లి యాంటిబయోటిక్స్ కొనకూడదు.
  • కఠిన నిబంధనలు: ప్రభుత్వం, ఆరోగ్య శాఖలు యాంటిబయోటిక్స్ విక్రయాలపై కఠినమైన పర్యవేక్షణ ఉంచాలి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *