Headlines

Uday Krishna Reddy: ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణారెడ్డికి రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు.. | IPS Trainee Uday Krishna Reddy Case: 14 days remand given to him, to take him to Chanchalguda Jail

Uday Krishna Reddy: ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణారెడ్డికి రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు.. | IPS Trainee Uday Krishna Reddy Case: 14 days remand given to him, to take him to Chanchalguda Jail

ట్రైనీ IPS ఉదయ్‌కృష్ణారెడ్డి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన ఉదయ్‌కృష్ణారెడ్డికి ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఉదయ్‌కృష్ణారెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.. ట్రైనీ IPS ఉదయ్‌కృష్ణారెడ్డిని అత్తాపూర్‌ పోలీసులు బుధవారం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపర్చగా.. న్యాయమూర్తి రిమాండ్ విధించారు.. లైంగిక వేధింపుల కేసులో ఉదయ్‌కృష్ణ నిన్న మిర్యాలగూడలో అరెస్ట్‌ అయ్యారు. ఈ నెల 22 నుంచి పరారీలో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్నారు. అక్కడనుంచి సికింద్రాబాద్ టాస్క్‌ఫోర్స్ ఆఫీస్‌కు తరలించారు.. ఉదయం ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఉప్పరపల్లి కోర్టులో హాజరుపర్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *