Headlines

Tata Avinya: ప్రపంచ దేశాలకు నిద్రలేకుండా చేస్తోన్న టాటా ‘అవిన్యా’.. డిజైన్‌తోనే మెంటలెక్కిస్తోందిగా..! | Tata avinya ev launch date new freelander platform design specs

Tata Avinya: ప్రపంచ దేశాలకు నిద్రలేకుండా చేస్తోన్న టాటా ‘అవిన్యా’.. డిజైన్‌తోనే మెంటలెక్కిస్తోందిగా..! | Tata avinya ev launch date new freelander platform design specs


భారత ఆటోమొబైల్ రంగంలో టాటా మోటార్స్ మరో సంచలనానికి తెరలేపుతోంది. భవిష్యత్తు మొబిలిటీకి నిదర్శనంగా నిలిచేలా, హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కనిపించే రేంజ్ డిజైన్‌తో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎలక్ట్రిక్ కారు ‘టాటా అవిన్యా (Tata Avinya)’ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది.

కళ్లు చెదిరే ఫ్యూచరిస్టిక్ డిజైన్..

టాటా మోటార్స్ మొదటిసారిగా అవిన్యా కాన్సెప్ట్‌ను ప్రపంచానికి పరిచయం చేసినప్పుడు దాని డిజైన్ చూసి ఆటోమొబైల్ నిపుణులే ఆశ్చర్యపోయారు. ఇది సాధారణ ఎస్‌యూవీ లేదా సెడాన్‌లా కాకుండా పూర్తిగా భవిష్యత్తు సాంకేతికతకు అద్దం పట్టేలా ఉంటుంది. కారు ముందు భాగంలో సాంప్రదాయ గ్రిల్స్ కు బదులుగా పెద్ద ఎల్ఈడీ లైట్ బార్‌తో కళ్లు చెదిరేలా డిజైన్ చేశారు. లోపల విశాలమైన క్యాబిన్, మినిమలిస్ట్ ఇంటీరియర్స్‌తో ప్రయాణికులకు ఒక లగ్జరీ ఫీల్ ఇచ్చేలా తీర్చిదిద్దారు. సంప్రదాయ డ్యాష్‌బోర్డ్‌లకు స్వస్తి పలికి, అత్యాధునిక డిజిటల్ కంట్రోల్ సిస్టమ్‌తో ఈ కారును రూపొందిస్తున్నారు.

ప్లాట్‌ఫామ్ మార్పు వెనుక అసలు వ్యూహం ఇదే..!

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో టాటా ఇటీవల తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఆటోమొబైల్ పరిశ్రమలో ఆసక్తికరంగా మారింది. ప్రారంభంలో అవిన్యా కారును జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) అభివృద్ధి చేస్తున్న ఈఎంఏ (ఎలక్ట్రిఫైడ్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్) ప్లాట్‌ఫామ్‌పై తీసుకురావాలని టాటా భావించింది. కానీ, తాజాగా ఈ ప్రణాళికను మార్చి చెర్రీ జేఎల్‌ఆర్ (Chery-JLR) సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఫ్రీలాండర్ (Freelander) ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించే దిశగా అడుగులు వేస్తోంది.

కారుకు అసలు పునాది ఈ ప్లాట్‌ఫామే. దీనిపైనే బ్యాటరీ, మోటార్, సస్పెన్షన్, పూర్తి ఇంజనీరింగ్ ఆధారపడి ఉంటాయి. తయారీ వ్యయాన్ని నియంత్రించడం, పరిశోధన-అభివృద్ధి (R&D) సమయాన్ని తగ్గించడం, మార్కెట్లోకి కారును వీలైనంత త్వరగా తీసుకురావడమే లక్ష్యంగా టాటా ఈ వ్యూహాత్మక అడుగు వేసినట్లు తెలుస్తోంది.

గ్లోబల్ మార్కెట్‌పై గురి.. విదేశీ బ్రాండ్లకు సవాల్..

ప్రస్తుతం భారత ఈవీ మార్కెట్‌లో నెక్సాన్, టియాగో, పంచ్, కర్వ్ లాంటి మోడల్స్‌తో టాటా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇప్పుడు అవిన్యా ద్వారా ఏకంగా ప్రీమియం ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో విదేశీ సంస్థలైన టెస్లా, బీవైడీ, మెర్సిడెస్, బీఎండబ్ల్యూ లాంటి గ్లోబల్ బ్రాండ్లకు నేరుగా సవాల్ విసరాలని చూస్తోంది. మొదటి ప్రొడక్షన్ మోడల్‌ను ‘అవిన్యా ఎక్స్’ పేరుతో తీసుకురావడానికి కంపెనీ సిద్ధమవుతున్నట్లు సమాచారం.

భారతదేశంలోనే పూర్తిగా తయారవుతున్న ఈ కారును కేవలం మన దేశానికే పరిమితం చేయకుండా, అంతర్జాతీయ మార్కెట్లలోకి కూడా విడుదల చేయాలని టాటా ప్లాన్ చేస్తోంది. అధునాతన క్యాబిన్, స్మార్ట్ సాఫ్ట్‌వేర్, హై-పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్ లాంటి ఫీచర్లతో రాబోతున్న అవిన్యా.. లాంచ్ తర్వాత భారతీయ ఆటోమొబైల్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. బ్యాటరీ రేంజ్, స్పెసిఫికేషన్లు, లాంచ్ డేట్ లాంటి పూర్తి వివరాలపై టాటా త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *