Headlines

Korean Kanakaraju: కనకరాజు కాసుల వర్షం.. ఇదొక చిత్రవిచిత్రం..! | Varun Tej’s Korean Kanakaraju Enters Safe Zone with Strong Pre Release Business video – Entertainment Videos in Telugu

Korean Kanakaraju: కనకరాజు కాసుల వర్షం.. ఇదొక చిత్రవిచిత్రం..! | Varun Tej’s Korean Kanakaraju Enters Safe Zone with Strong Pre Release Business video – Entertainment Videos in Telugu


వరుణ్ తేజ్ నటిస్తున్న కొత్త సినిమా రిలీజ్ కాకముందే నిర్మాతలను సేఫ్ జోన్‌లోకి తీసుకెళ్లిందా..? ట్రాక్ రికార్డులతో పనిలేకుండా.. గత పరాజయాలతో అవసరం లేకుండా వరుణ్ తేజ్ కెరీర్‌ను కొరియన్ కనకరాజు కాపాడాలని ఫిక్సైపోయాడా..? థియేటర్లలో బొమ్మ పడకముందే నాన్ థియేట్రికల్ రైట్స్‌తో కనకరాజు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయాడు. మరి ఆ బిజినెస్ కథేంటో చూద్దామా..? వరుణ్ తేజ్, మెర్లపాక గాంధీ కాంబినేషన్‌లో వస్తున్న కొరియన్ కనకరాజు సినిమా రీ సౌండ్ బాక్సాఫీస్ వద్ద బాగానే వస్తుంది. దాదాపు 38 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రిలీజ్‌కు ముందే నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా ఏకంగా 26 కోట్లు రాబట్టింది. ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్, హిందీ డబ్బింగ్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోవడంతో బయ్యర్లలో ఈ సినిమాపై నమ్మకం పెరిగిపోయింది. 12 నుంచి 15 కోట్ల రేంజ్‌లో థియేట్రికల్ కలెక్షన్స్ వస్తే చాలు.. నిర్మాతలు సేఫ్ జోన్‌లోకి వెళ్ళిపోతారు. సినిమా థియేటర్లలోకి రాకముందే ఈ స్థాయి బిజినెస్ కావడం, మేకర్స్‌కు టేబుల్ ప్రాఫిట్ అందించడం ట్రేడ్ వర్గాల్లో ఓ చర్చనీయాంశంగా మారింది. ప్రమోషనల్ కంటెంట్‌కు ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే బిజినెస్ మరింత పెరిగేలా కనిపిస్తోంది. వరుణ్ తేజ్‌ సరసన రితీకా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మేర్లపాక గాంధీకి అచ్చొచ్చిన కమెడియన్ సత్య ఇందులో కీలక పాత్ర చేస్తున్నారు. యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ కామిక్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ కొరియన్ కనకరాజు థియేటర్లలో ఏ రేంజ్ అలరిస్తుందో చూడాలి. ఆగస్ట్ 7న సినిమా రానుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చైనా సరికొత్త రోబో.. దీని స్పెషాలిటీ తెలిస్తే షాకవ్వాల్సిందే!

మన కరెన్సీపై పదేళ్ల ఆంక్షలకు తెర.. రూ.500 నోట్లకు నేపాల్ గ్రీన్ సిగ్నల్

ఇల్లు కొనడానికి పీఎఫ్ డబ్బులు తీస్తున్నారా? ఈ వార్త మీకోసమే!

ఓరి మీ కక్కుర్తి కూలా.. ఇదేం పనిరా సామీ!

ఇకపై నన్ను అలా పిలవొద్దు.. పవన్ అర్ధాంగి ఎమోషనల్ పోస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *