Headlines

UPI Payments: జస్ట్ టచ్ చేస్తే ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్, పిన్ అక్కర్లేదు.. ఇది మాములు ఫీచర్ కాదు భయ్యా.. | UPI Payments Without Internet Soon: NPCI to Launch ‘Tap to Pay’ Feature

UPI Payments: జస్ట్ టచ్ చేస్తే ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్, పిన్ అక్కర్లేదు.. ఇది మాములు ఫీచర్ కాదు భయ్యా.. | UPI Payments Without Internet Soon: NPCI to Launch ‘Tap to Pay’ Feature


దేశంలో యూపీఐ పేమెంట్స్ సౌకర్యం వచ్చాక బ్యాంకింగ్ రంగం పూర్తిగా మారిపోయింది. సులువుగా బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్లు చేసే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం దేశంలో రికార్డ్ స్థాయిలో యూపీఐ లావాదేవీలు అనేవి జరుగుతున్నాయి. గ్రామాలు, పట్టణాలు, సిటీలు అనే తేడా లేకుండా ప్రతీచోట యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం లేదా మొబైల్ నెంబర్, యూపీఐ ఐడీ ఎంటర్ చేయడం ద్వారా సులువుగా సెకన్లలోనే లావాదేవీలు చేయలగుతున్నారు. అయితే యూపీఐ లావాదేవీు చేయాలంటే స్మార్ట్ ఫోన్‌తో పాటు ఇంటర్నెట్ అందుబాటులో ఉండాలని చాలామంది అనుకుంటారు. కానీ అప్పటి లెక్క. ఇక నుంచి లెక్క మారనుంది. ఇంటర్నె్ట్ లేకపోయినా విమానం, మారుమూల ప్రాంతాలు, భూగర్భ ప్రాంతాల్లో కూడా ట్రాన్సక్షన్లు చేయవచ్చు. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఒక కొత్త ఫీచర్‌ను త్వరలో తీసుకొచ్చేందుకు రంగం సిద్దం చేస్తోంది.

అసలు ఈ ఫీచర్ ఏంటి..?

వ్యాపారుల వద్ద పీఓఎస్ మెషీన్లు ఉంటాయి. బ్యాంకులు వీటిని జారీ చేస్తాయి. ఈ మెషీన్ల ద్వారా యూపీఐ, క్రెడిట్, క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్స్ చేయవచ్చు. యూపీఐ ద్వారా చెల్లించాలంటే ఇంటర్నెట్ అవసరం. కానీ పీఓఎస్ మెషిన్లపై స్మార్ట్‌ఫోన్‌ను ట్యాప్ చేయడం ద్వారా ఇంటర్నెట్ లేకపోయినా పేమెంట్స్ చేయవచ్చు. ఇందుకోసం “ట్యాప్ టు పే” ఫీచర్‌ను ఎన్‌పీసీఐ అభివృద్ధి చేస్తోంది. ఎన్‌ఎఫ్‌సి అనే కొత్త టెక్నాలజీని ఇందుకు ఉపయోగించుకుంటుంది. కొన్ని టెక్నాలజీ కంపెనీలు కూడా ఎన్‌పీసీఐకు సపోర్ట్ అందిస్తున్నాయి.

ఎన్‌ఎఫ్‌సి ఫీచర్ ఎలా పనిచేస్తుంది..?

నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్స్ ఆధారంగా ఈ ఫీచర్ పనిచేస్తుంది. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం లేదా ఇంటర్నెట్ అవసరం లేకుండా ఈ కొత్త సాంకేతికత ద్వారా పేమెంట్స్ జరపవచ్చు. ఇందుకోసం కస్టమర్‌ UPI లైట్‌లో బ్యాలెన్స్ కలిగి ఉండాలి. అలాగే వినియోగదారుడి స్మార్ట్‌ఫోన్‌కు NFC సపోర్ట్ ఉండాలి. ఈ విధానంలో POS మెషీన్‌కు ఫోన్‌ను తాకడం ద్వారా చెల్లింపులు పూర్తవుతాయి. పిన్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. దీంతో వేగవంతంగా చెల్లింపులు చేయవచ్చు.

చెల్లింపులు ఎలా చేయాలి..?

ముందుగా UPI లైట్‌కు బ్యాలెన్స్ యాడ్ చేయాలి. ఇందుకు ఇంటర్నెట్ అనేది అవసరం. మీరు ఎక్కడైనా వ్యాపారి దగ్గర చెల్లింపులు చేయాలంటే.. మీ NFC సదుపాయం ఉన్న ఫోన్‌ను POS మెషీన్‌కు తాకితే ఆటోమేటిక్‌గా చెల్లింపు పూర్తవుతుంది. ఫోన్ లేదా మెషీన్‌కు ఇంటర్నెట్ కనెక్షన్ తిరిగి వచ్చినప్పుడు చెల్లింపు సమాచారం బ్యాంకుకు పంపబడుతుంది. అయితే ఈ విధానంలో రూ.2 వేల వరకు మాత్రమే పేమెంట్స్ చేయవచ్చు. అంతకంటే ఎక్కువ పంపలేము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *