Headlines

ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా..? 99% మందికి తెలియక చేసే పొరబాటు | Green Potatoes: Are They Safe to Eat? Know the Hidden Health Risk

ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా..? 99% మందికి తెలియక చేసే పొరబాటు | Green Potatoes: Are They Safe to Eat? Know the Hidden Health Risk


ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. ఎందుకంటే ఇది కేవలం రంగు మార్పు మాత్రమే కాకుండా, వాటిలో సహజ విష పదార్థమైన సోలనిన్ స్థాయి పెరుగుతోందనే సంకేతం కావచ్చు.

బంగాళాదుంపలు ఆకుపచ్చగా ఎందుకు మారుతాయి?

బంగాళాదుంపలు ఎక్కువసేపు సూర్యరశ్మికి లేదా కృత్రిమ కాంతికి గురైనప్పుడు వాటి ఉపరితలంపై క్లోరోఫిల్ అనే పదార్థం ఏర్పడుతుంది. దీని కారణంగానే బంగాళాదుంపలు ఆకుపచ్చగా కనిపిస్తాయి. క్లోరోఫిల్ వల్ల నేరుగా ఆరోగ్య సమస్యలు రావు. కానీ బంగాళాదుంపలు ఆకుపచ్చగా మారే ప్రక్రియలో సోలనిన్ అనే సహజ విష సమ్మేళనం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది అధిక మోతాదులో శరీరంలోకి వెళితే అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.

పచ్చి బంగాళాదుంపలు తింటే ఏమి జరుగుతుంది?

సోలనిన్ అధికంగా ఉన్న బంగాళాదుంపలను తినడం వల్ల కొంతమందిలో ఈ లక్షణాలు కనిపించవచ్చు:

  • వికారం, వాంతులు
  • కడుపు నొప్పి
  • విరేచనాలు
  • తల తిరగడం
  • తీవ్రమైన తలనొప్పి
  • బలహీనత
  • అరుదైన సందర్భాల్లో నాడీ వ్యవస్థపై ప్రభావం

పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఈ ప్రభావాలు మరింత తీవ్రంగా కనిపించే అవకాశం ఉంటుంది.

ఆకుపచ్చ భాగాన్ని తొలగించి తినవచ్చా?

బంగాళాదుంపలో కొద్దిగా మాత్రమే ఆకుపచ్చ భాగం ఉంటే, ఆ భాగాన్ని మందపాటి పొరతో పాటు పూర్తిగా తొలగించి మిగిలిన భాగాన్ని ఉపయోగించవచ్చు. అయితే ఈ పరిస్థితుల్లో మాత్రం వాటిని వాడకపోవడం మంచిది..

  • బంగాళాదుంప ఎక్కువ భాగం ఆకుపచ్చగా మారితే
  • ఎక్కువగా మొలకలు వస్తే
  • చేదు రుచి లేదా వాసన వస్తే
  • మెత్తగా మారి కుళ్లిపోయినట్లు ఉంటే

బంగాళాదుంపలను ఎలా నిల్వ చేయాలి?

బంగాళాదుంపలకు చిన్న మొలకలు మాత్రమే వస్తే, వాటిని తొలగించి చుట్టుపక్కల భాగాన్ని తీసివేసి ఉపయోగించవచ్చు. కానీ ఎక్కువగా మొలకలు వచ్చినా లేదా బంగాళాదుంప ముడుచుకుపోయి మెత్తగా మారినా వాటిని ఉపయోగించకుండా ఉండటం ఉత్తమం. బంగాళాదుంపలు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించాలంటే..

  • చల్లని, పొడి మరియు చీకటి ప్రదేశంలో ఉంచాలి.
  • గాలి ప్రసరణ ఉండే బుట్టలో లేదా కాగితపు సంచిలో నిల్వ చేయాలి.
  • ప్రత్యక్ష సూర్యరశ్మికి దూరంగా ఉంచాలి.
  • ఎక్కువసేపు ప్లాస్టిక్ కవర్లలో ఉంచకూడదు.
  • ఉల్లిపాయలతో కలిసి నిల్వ చేయకూడదు. ఉల్లిపాయల నుంచి విడుదలయ్యే వాయువుల వల్ల బంగాళాదుంపలు త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది.
  • సాధ్యమైనంత వరకు ఫ్రిజ్‌లో ఎక్కువ కాలం నిల్వ చేయకుండా ఉండాలి. తక్కువ ఉష్ణోగ్రతల వల్ల బంగాళాదుంపలోని పిండి పదార్థం చక్కెరగా మారి రుచి, నాణ్యత మారవచ్చు.

బంగాళాదుంపలు కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే..?

  • ఆకుపచ్చ మచ్చలు లేని వాటిని ఎంచుకోండి.
  • గట్టిగా ఉన్న బంగాళాదుంపలను మాత్రమే కొనండి.
  • ఎక్కువగా మొలకలు వచ్చిన వాటిని కొనవద్దు.
  • ముడతలు పడిన లేదా మెత్తగా ఉన్న బంగాళాదుంపలను దూరంగా ఉంచండి.

బంగాళాదుంపలు ఆరోగ్యకరమైన ఆహారంలో భాగమే అయినప్పటికీ, వాటిని సరైన విధంగా నిల్వ చేయడం చాలా ముఖ్యం. ఆకుపచ్చగా మారిన లేదా ఎక్కువగా మొలకెత్తిన బంగాళాదుంపలను జాగ్రత్తగా పరిశీలించి మాత్రమే ఉపయోగించాలి. చిన్న నిర్లక్ష్యం కూడా ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *