Headlines

విదేశీ విద్యార్థులకు బిగ్ షాక్.. చదువు పూర్తయ్యాక అమెరికాలో ఉద్యోగం చేయాలంటే లక్ష డాలర్ల ఫీజు? | US May Charge $100,000 for OPT Work Permit After Graduation: Report

విదేశీ విద్యార్థులకు బిగ్ షాక్.. చదువు పూర్తయ్యాక అమెరికాలో ఉద్యోగం చేయాలంటే లక్ష డాలర్ల ఫీజు? | US May Charge 0,000 for OPT Work Permit After Graduation: Report


అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించి, అక్కడే మంచి ఉద్యోగంలో స్థిరపడాలని కలలు కనే వేలాది మంది భారతీయ విద్యార్థులకు ఆందోళన కలిగించే వార్త వెలుగులోకి వచ్చింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విదేశీ విద్యార్థులు అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగం చేసేందుకు వీలు కల్పించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) నిబంధనలను అత్యంత కఠినతరం చేసేందుకు డోనాల్డ్ ట్రంప్ యంత్రాంగం కసరత్తు చేస్తున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, యూఎస్ విశ్వవిద్యాలయాల నుండి డిగ్రీలు పూర్తి చేసిన విదేశీ విద్యార్థులు ఓపీటీ ద్వారా అమెరికాలోనే ఉద్యోగం చేయడానికి సిద్ధపడితే, వారిపై డాలర్ 1,00,000(లక్ష డాలర్ల ఓపీటీ ఫీజు) అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 83 లక్షలకు పైగా భారీ ఫీజు విధించాలని భావిస్తున్నారు. ఈ మొత్తాన్ని నియామకం చేపట్టే కంపెనీలు లేదా విద్యార్థులే భరించాల్సి వస్తుందనే చర్చ నడుస్తోంది.

భారతీయ విద్యార్థులపై పడే ప్రభావం:

సాధారణంగా ఎస్టీఈఎమ్ (STEM – సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) కోర్సులు పూర్తి చేసిన అంతర్జాతీయ విద్యార్థులకు చదువు పూర్తయ్యాక 3 సంవత్సరాల వరకు ఓపీటీ కింద అమెరికాలో పనిచేసే అనుమతి లభిస్తుంది. కానీ, ఇప్పుడు ఇంత భారీ మొత్తంలో ఫీజు చెల్లించాల్సి వస్తే, అమెరికన్ కంపెనీలు విదేశీ ఫ్రెషర్లను ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి అస్సలు ఆసక్తి చూపవు. అమెరికాలో ఉన్నత విద్య నభ్యసిస్తున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అత్యధిక సంఖ్యలో ఉన్నందున, ఈ నిర్ణయం మన దేశ విద్యార్థుల కెరీర్ కలలపై కోలుకోలేని దెబ్బ తీసే అవకాశం ఉంది. ఇప్పటికే విదేశీ విద్య కోసం భారీగా విద్యా రుణాలు తీసుకున్న భారతీయ విద్యార్థులకు చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం రాకపోతే ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగులుతుంది.

అమెరికా ఫస్ట్ అనే ట్రంప్ వ్యూహం:

స్థానిక అమెరికన్ పౌరులకు ఉద్యోగ భద్రత కల్పించడం, స్వదేశీ వేతనాలను కాపాడటమే లక్ష్యంగా అమెరికా ఫస్ట్ నినాదంతో ట్రంప్ యంత్రాంగం ఈ నిర్ణయం వైపు అడుగులు వేస్తోంది. గతంలో హెచ్-1బి (H-1B) వీసాలపై తెచ్చిన ఆంక్షలకు న్యాయస్థానాల్లో చిక్కులు ఎదురుకావడంతో, ఇప్పుడు ఓపీటీ మార్గాన్ని కఠినతరం చేయడం ద్వారా విదేశీ నిపుణుల చేరికను అడ్డుకోవాలని చూస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అంశంపై ఇంకా తుది అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నప్పటికీ, ఈ వార్తలు అంతర్జాతీయ విద్యార్థి లోకంలో, విదేశీ విద్యా రంగంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. రాబోయే రోజుల్లో అమెరికా ప్రభుత్వం దీనిపై ఎలాంటి స్పష్టత ఇస్తుందో వేచి చూడాలి. ఒకవేళ ఈ $1,00,000 ఫీజు నిబంధన అమల్లోకి వస్తే, భారతీయ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అమెరికాను వదిలి కెనడా, బ్రిటన్, జర్మనీ లేదా ఆస్ట్రేలియా వైపు మొగ్గు చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి



మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *