Headlines

Albie Morkel : సూపర్ కింగ్స్ హెడ్ కోచ్‌గా సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ | Albie Morkel Appointed Joburg Super Kings Head Coach Ahead of SA20 Season 5

Albie Morkel : సూపర్ కింగ్స్ హెడ్ కోచ్‌గా సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ | Albie Morkel Appointed Joburg Super Kings Head Coach Ahead of SA20 Season 5


Albie Morkel : సౌతాఫ్రికా టీ20 లీగ్ (SA20) ఐదో సీజన్ ప్రారంభానికి ముందే జోబర్గ్ సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు కొత్త హెడ్ కోచ్‌గా సౌతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్, సీఎస్కే మాజీ స్టార్ అల్బీ మోర్కెల్‌ను నియమిస్తున్నట్లు గురువారం అధికారికంగా ప్రకటించింది. గత నాలుగు సీజన్లుగా హెడ్ కోచ్‌గా సేవలందించిన దిగ్గజ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆ పదవి నుంచి తప్పుకోవడంతో ఆ స్థానాన్ని అల్బీ మోర్కెల్‌తో భర్తీ చేసింది యజమాన్యం.

అల్బీ మోర్కెల్‌కు సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీతో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఐపీఎల్‎లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున ఆల్‌రౌండర్‌గా మెరుపులు మెరిపించిన మోర్కెల్, ఎస్‌ఏ20 లీగ్ తొలి సీజన్ నుంచే జోబర్గ్ సూపర్ కింగ్స్ కోచింగ్ స్టాఫ్‌లో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆటగాడిగా, అసిస్టెంట్ కోచ్‌గా ఫ్రాంచైజీ సంస్కృతిని, ఆటగాళ్ల బలాబలాలను నరనరాన వంటబట్టించుకున్న ఆయనకు ఇప్పుడు ఏకంగా ప్రధాన కోచ్ బాధ్యతలు అప్పగించడం విశేషం.

అల్బీ మోర్కెల్ నియామకంపై సూపర్ కింగ్స్ యజమాని రూపా గురునాథ్ స్పందిస్తూ.. “అల్బీ మోర్కెల్ గత కొన్ని ఏళ్లుగా మా కోచింగ్ బృందంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. సూపర్ కింగ్స్ విలువలు, భావజాలం ఆయనకు బాగా తెలుసు. ఆటగాళ్ల పురోగతిలో వెనుకుండి నడిపించిన ఆయన, ఇప్పుడు హెడ్ కోచ్‌గా జట్టును ముందుండి నడిపిస్తారని భావిస్తున్నాం” అని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే జోబర్గ్ సూపర్ కింగ్స్ డైరెక్టర్ కె.ఎస్.విశ్వనాథన్ మాట్లాడుతూ.. సౌతాఫ్రికా క్రికెట్ వాతావరణంపై మోర్కెల్‌కు ఉన్న పట్టు జట్టు విజయంలో కీలకమవుతుందని పేర్కొన్నారు.

తన నియామకంపై అల్బీ మోర్కెల్ హర్షం వ్యక్తం చేశారు. “జోబర్గ్ సూపర్ కింగ్స్ హెడ్ కోచ్‌గా ఎంపికవ్వడం నాకెంతో గర్వకారణం. ఒకప్పుడు ఆటగాడిగా పసుపు జెర్సీ ధరించి, ఇప్పుడు అదే ఫ్రాంచైజీకి హెడ్ కోచ్‌గా వ్యవహరించడం నా కెరీర్‌లో చాలా ప్రత్యేకమైనది. మేమంతా కలిసి నిర్మించుకున్న బలమైన పునాదులపై జట్టును మరింత ఎత్తుకు తీసుకెళ్లేందుకు నా వంతు కృషి చేస్తాను” అని ఆయన అన్నారు. కాగా ఇటీవలే ముగిసిన సీజన్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్ లీగ్ దశలో నాలుగో స్థానంలో నిలిచి, ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *