Headlines

Video: ఒళ్ళు గగుర్పొడిచే సీన్.. భారీ పాముకే షాకిచ్చిన చేప.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..! | Electric catfish shock snake attack viral wildlife video


Electric Catfish Shock Snake: ప్రకృతి ఒడిలో జీవుల మనుగడ పోరాటం ఎప్పుడూ విస్మయానికి గురిచేస్తూనే ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక షాకింగ్ వీడియో నెటిజన్లను నోరెళ్లబెట్టేలా చేస్తోంది. తనను వేటాడటానికి వచ్చిన ఒక విషపూరిత పాముకు, విద్యుత్ షాక్‌తో చుక్కలు చూపించింది ఒక విచిత్రమైన చేప. కొద్దిసేపట్లోనే పాము చనిపోవడం ఈ వీడియోలో చూడొచ్చు.

బుదర నీటిలో మరణపోరాటం.. కరెంట్ షాక్‌తో వణికిపోయిన పాము..!

సాధారణంగా నీటిలో లేదా నేలపై పాము ఎదురుపడితే ఏ జీవి అయినా ప్రాణ భయంతో పరుగులు తీస్తుంది. అయితే ఈ వైరల్ వీడియోలో ఒక చారల పాము, బురద నీటిలో ఈదుతున్న భారీ చేపపై హఠాత్తుగా దాడి చేసి పట్టు బిగించింది. తనను నోట కరిచి పట్టుకున్న పాము నుంచి తప్పించుకోవడానికి ఆ చేప తనలోని అసాధారణమైన ఆత్మరక్షణ కవచాన్ని బయటకు తీసింది.

తన శరీరం నుంచి ఒక్కసారిగా శక్తివంతమైన విద్యుత్ తరంగాలను విడుదల చేసింది. దాంతో కరెంట్ షాక్‌కు గురైన ఆ పాము విలవిలలాడిపోతూ, తట్టుకోలేక తక్షణమే తన పట్టును విడిచిపెట్టేసింది. కరెంట్ షాక్ దెబ్బకు పాము శరీరం మెలికలు తిరుగుతూ నీటిలో కొట్టుమిట్టాడటం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.

ఆత్మరక్షణలో ఎలక్ట్రిక్ చేపల వ్యూహం..!

ఈ అరుదైన దృశ్యం సామజిక మాధ్యమాల్లో క్షణాల్లో వైరల్‌గా మారింది. “ఎలక్ట్రిక్ చేపల ఆత్మరక్షణ వ్యవస్థ నిజంగా ఊహకందనిది” అనే శీర్షికతో నెటిజన్లు ఈ వీడియోను విపరీతంగా పంచుకుంటున్నారు. అసలు ఒక చిన్న చేప అంత శక్తివంతమైన విద్యుత్‌ను ఎలా ఉత్పత్తి చేయగలదనే సందేహం చాలామందిలో వ్యక్తమవుతోంది.

శాస్త్రవేత్తల ప్రకారం.. ఆఫ్రికన్ మంచి నీటి సరస్సుల్లో కనిపించే ఈ ‘ఎలక్ట్రిక్ క్యాట్‌ఫిష్’ తమ ప్రత్యేక కండర కణజాలం ద్వారా దాదాపు 350 వోల్టుల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలవు. తమ కంటే పెద్దవైన క్రూర మృగాలు లేదా పాములు దాడి చేసినప్పుడు, ఇవి ఈ కరెంట్ షాక్‌ను అస్త్రంగా ఉపయోగిస్తాయి. ఈ దెబ్బతో ఎంతటి పెద్ద జీవి అయినా సరే మైకం కమ్మి పారిపోవాల్సిందే.

ప్రకృతి వింతకు నెటిజన్లు ఫిదా..!

ఈ జంతు ప్రపంచపు అద్భుత పోరాట దృశ్యాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రకృతి ప్రతి జీవికి తనను తాను కాపాడుకోవడానికి ఒక ప్రత్యేకమైన శక్తిని ప్రసాదించిందని కామెంట్లు చేస్తున్నారు. “దేవుడి సృష్టి నిజంగానే మహా విచిత్రం” అంటూ నెటిజన్లు ఈ వీడియోపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే, కొంతమంది ఇది ఏఐ జనరేటేడ్ వీడియో అంటూ కామెంట్ చేస్తున్నారు. నిజంగా ఇలా జరుగుతాయా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *